Kethamreddy Vinod Reddy, Pawan Kalyan
Kethamreddy Vinod Reddy: మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి నెల్లూరు కీలక నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. మొదట తాను కాంగ్రెస్ లో పనిచేశానని చెప్పారు.
అనంతరం యువతకు ప్రాధాన్యం కల్పిస్తానన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగాల పట్ల ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరానని తెలిపారు. నెల్లూరు సిటీలో తన పనిని గుర్తించిన పవన్ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. ఆ ఎన్నికల్లో ఓడిననా తాను ఏనాడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తెలిపారు.
అయితే, తాను పోటీ చేసిన నియోజకవర్గంలో పార్టీ పరంగా అంతర్గతంగా తాను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. తనకు జనసేనలో ఎలాంటి పదవులు ఇవ్వలేదని, పార్టీ కార్యక్రమాలకు పిలవలేదని తెలిపారు. తనకు తగిన విలువ ఇవ్వకుండా తాను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా పంటి బిగువున భరించానని అన్నారు.
ఓ సారి పవన్ ఎదుటే కన్నీటిపర్యంతం అయ్యానని, అది తప్పించి ఎప్పుడూ మరో వేదికలో పంచుకోలేదని తెలిపారు. నెల్లూరు సిటీలో 316 రోజులు తాను ఒక్క ఇల్లూ మిస్ కాకుండా పవనన్న ప్రజాబాట కార్యక్రమం కొనసాగించానని చెప్పారు. తాను ఎప్పుడూ ఎన్నికల్లో సీటు గురించి ఆలోచించలేదని అన్నారు. మూడు నెలల క్రితం మాజీ మంత్రి నారాయణను నెల్లూరు సిటీ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించిందని చెప్పారు. అప్పుడు టీడీపీ-జనసేనకు మధ్య పొత్తు లేదని చెప్పారు. అయినప్పటికీ సీటుని తానేం ఆశించలేదని అన్నారు.
టికెట్ కోసం పార్టీని అభ్యర్థించలేదని తెలిపారు. అయితే, తాను ప్రస్తుత పరిస్థితుల్లో అవమానాలను భరిస్తూ ఉండలేనని, తన ఓర్పు, సహనం నశించిందని చెప్పారు. అన్ని కోణాల్లోనూ అలోచించి, తనతో కలిసి పనిచేసిన అనేక మంది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకున్నానని, జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
Kethamreddy Vinod Reddy
Kethamreddy Vinod Reddy
Lokesh : ఏపీ హైకోర్టులో లోకేష్ కు ఊరట.. ముందస్తు బెయిల్ పిటిషన్ క్లోజ్ చేసిన ధర్మాసనం