TDP Politburo : కడపలో మహానాడు..- టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం

మరోవైపు నామినేటెడ్ పదవులపైనా పొలిట్ బ్యూరోలో చర్చ జరిగిందని తెలుస్తోంది.

TDP Politburo : టీడీపీ పొలిట్ బ్యూరో కీలక భేటీ జరిగింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మూడున్నర గంటల పాటు సాగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. మే నెలలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని కడపలో నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరోలో నిర్ణయించినట్లు సమాచారం. మహానాడు తర్వాత పార్టీలో సంస్థాగత మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అంశంపై కీలక చర్చ జరిగింది. త్వరలో పార్టీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం. ఇక, మే నెలలో జరిగే మహానాడు కల్లా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

మరోవైపు నామినేటెడ్ పదవులపైనా పొలిట్ బ్యూరోలో చర్చ జరిగిందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రత్యేక కార్యక్రమం రూపకల్పన చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించారు. పార్టీ సభ్యత్వ నమోదుపైనా పొలిట్ బ్యూరోలో సమాలోచనలు జరిగాయి.

Also Read : విజయనగరం డీసీసీబీ పీఠంపై తెలుగు తమ్ముళ్ల ఎత్తులు.. తమకు అనుకూలంగా ఉండే నేతకు పదవి దక్కేలా లాబీయింగ్..!

పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు..!
పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం
మూడు నెలల వ్యవధిలోనే గ్రామ స్థాయి కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు పూర్తి చేయాలి
మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి టీడీపీ అధ్యక్ష పదవికి ఎన్నుకునే కార్యాచరణ సిద్ధం
సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైన మహానాడు వరకు జరుగుతుంది
అధ్యక్షుడి చంద్రబాబును ఎన్నుకోవడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది
బడుగు, బలహీన వర్గాలకు కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నిర్ణయం

Also Read : 6 నెలల్లో 520 సేవలు, వ్యక్తిగత సమాచారం లీకయ్యే సమస్యే లేదు- వాట్సప్ గవర్నెన్స్‌పై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు..

నామినేటెడ్ పదవులపై సుదీర్ఘంగా చర్చ
మూడో దఫా నామినేటెడ్ పదవుల భర్తీలో అర్హులైన వారితో జాబితాలు సిద్ధం
వీలైనంత తొందరలోనే ఒకటి రెండు రోజుల్లోనే నామినేటెడ్ పదవుల మూడో దఫా జాబితా విడుదలకు ప్రణాళిక
అసెంబ్లీ సమావేశాల అనంతరం మార్చిలో ప్రజల్లోకి ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం వెళ్లేందుకు కార్యక్రమం రూపకల్పన
ప్రజల్లోకి వెళ్లి చేస్తున్న కార్యక్రమాలు వివరించేలా ప్లాన్

తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నారా లోకేశ్ భావిస్తున్నారు
పార్టీలో ఒకే పదవిని మూడుసార్లు కన్నా ఎక్కువ నిర్వహించడానికి వీల్లేదని, కొంత గ్యాప్ కావాల్సిన అవసరం ఉందని, కొత్త వారికి కీలక పదవులు అప్పగించేలా ప్రణాళిక.