Kodali Nani: ఇలాచేస్తే యుద్ధం అవ్వదు.. కామెడీ పోస్ట్ అవుతుంది: మాజీ మంత్రి కొడాలి నాని

ప్రతిపక్షాలేమో యుద్ధం పేరుతో తమ ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడుతున్నాయని కొడాలి నాని చెప్పారు.

Kodali Nani-Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ‘సీఎం జగన్ సిద్ధం అంటే మేము యుద్ధానికి సిద్ధం’ అంటూ పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి కొడాలి నాని కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే సిద్ధం పేరుతో దూసుకెళ్తున్నారని తెలిపారు.

ప్రతిపక్షాలేమో యుద్ధం పేరుతో తమ ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడుతున్నాయని కొడాలి నాని చెప్పారు. ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం అవ్వదని కామెడీ పోస్ట్ అవుతుందని ఎద్దేవా చేశారు. పవన్ ఎక్కడ యుద్ధం చేస్తారని అడిగారు. అలాగే, చంద్రబాబు, బీజేపీ యుద్ధం చేసేది ఎక్కడని ప్రశ్నించారు. అందరూ కలిసి యుద్ధం చేస్తారా? అని అన్నారు.

ఎవరు ఎవరితో యుద్ధం చేస్తారని కొడాలి నాని ప్రశ్నించారు. ఎవరెవరు ఎక్కడ యుద్ధానికి సిద్ధమో కనీసం వాళ్లకైనా స్పష్టత ఉందా? అని అన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేయబోతున్నారని, ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నారని నిలదీశారు.

వీళ్లతో బీజేపీ కలిసే యుద్ధం చేయబోతుందా? విడిగా చేస్తుందా? అని కొడాలి నాని అడిగారు. టీడీపీ, జనసేనలో టిక్కెట్లు ఆశించేవారికైనా ఈ విషయం గురించి తెలుసా? అని అన్నారు. ఎక్కడ ఎన్ని సీట్లలో పోటీచేస్తారో ముందు క్లారిటీ తెచ్చుకోవాలని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే సిద్ధం పేరుతో దూసుకెళ్తున్నారని తెలిపారు.

Read Also: కేసీఆర్ ప్యాకేజీతోనే బండి సంజయ్‌ను దించేశారు: జగ్గారెడ్డి

ట్రెండింగ్ వార్తలు