Kodali Nani : 2024లోనూ సీన్ రిపీట్ పక్కా.. అలా అనుకుంటే అది బీఆర్ఎస్ అమాయకత్వమే-కొడాలి నాని

Kodali Nani: చంద్రబాబు తన సొంత గ్రామం చంద్రగిరిలో 25 ఏళ్లుగా గెలవలేకపోయారు. ప్రెస్ స్టేట్ మెంట్స్ వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందని అనుకోవడం బీఆర్ఎస్ భ్రమ, అమాయకత్వం.

Kodali Nani : గుడివాడలో తనను ఓడించాలని ఇప్పటికి రెండుసార్లు చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారని, కానీ వాళ్లే ఓడిపోయారని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. 2024 లోనూ అదే రిపీట్ అవ్వబోతుందన్నారు. ఇదంతా రొటీన్ అని చెప్పారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు, ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు కొడాలి నాని.

చంద్రబాబు తన సొంత గ్రామం చంద్రగిరిలో 25 ఏళ్లుగా గెలవలేకపోయాడన్నారు. చంద్రగిరిలో వేశ్య గృహాలు, పేకాట క్లబ్ లు పెట్టాడని, ప్రజలు తన్ని తరిమేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గుడివాడ వచ్చి ఖాళీ కుర్చీలకి గంట ఉపన్యాసం ఇచ్చాడని అన్నారు. నేనంటే చంద్రబాబుకి భయం. రెండు రోజులు గుడివాడ చుట్టూ తిరిగాడు అని అన్నారు.

Also Read..Thota Chandrasekhar : ఏపీలో ఇది బీఆర్ఎస్ తొలి విజయం-తోట చంద్రశేఖర్

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం రోజుకో మాట మాట్లాడుతోందని కొడాలి నాని విమర్శించారు. నిన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదన్నారు. ఈరోజు ఉంది అంటున్నారు. కేంద్రం తీరు కరెక్ట్ కాదు. మేము మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకం అని కొడాలి నాని తేల్చి చెప్పారు. లాస్ రాకుండా స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించాలని కేంద్రాన్ని అడుగుతున్నామన్నారు. ప్రెస్ స్టేట్ మెంట్స్ వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందని అనుకోవడం బీఆర్ఎస్ భ్రమ, అమాయకత్వం అన్నారు కొడాలి నాని.

Also Read..Seediri Appalaraju: మాకు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ.. ఈ పార్టీతో సమానం: మంత్రి సీదిరి అప్పలరాజు

”ఒకసారి ఢిల్లీ వెళ్లి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే అది పవన్ కి పోరాటమా? హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెడితే కేంద్రం వెనక్కి తగ్గిపోతుందా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అపాల్సిన పక్రియ జగన్ చేస్తున్నారు. సీఎం జగన్ వెళ్లి రెండు రోజులు ధర్నా చేస్తే అయిపోతుందా? మా పోరాటం రాజకీయాలకి అతీతంగా జరుగుతుంది? గురువింద కింద మచ్చ దానికి తెలియదన్నట్లు ఉంది బీఆర్ఎస్ పరిస్థితి” అని కొడాలి నాని అన్నారు.