పెరిగిన కృష్ణానది వరద ప్రవాహం.. వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలి: విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Krishna River flood

కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద‌ ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వాగులు/కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని చెప్పారు.

Also Read: వీడియో: బండి సంజయ్‌ చొరవ.. వరదలో చిక్కుకున్న రైతులను హెలికాప్టర్లలో తీసుకొచ్చిన దృశ్యాలు చూడండి..

తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

మరోవైపు, తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. ఒడిశా దగ్గర అల్పపీడనం తీరం దాటింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 3 గంటల్లో తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు అధికారులు.

హనుమకొండ, కామారెడ్డి, కరీంనగర్‌, మెదక్‌, మేడ్చల్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం.. సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.