వీడియో: బండి సంజయ్‌ చొరవ.. వరదలో చిక్కుకున్న రైతులను హెలికాప్టర్లలో తీసుకొచ్చిన దృశ్యాలు చూడండి..

గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపేందుకు నిన్న ఐదుగురు వ్యక్తులు వెళ్లారు. ఎగువ మానేరు వద్ద చిక్కుకున్నారు.

వీడియో: బండి సంజయ్‌ చొరవ.. వరదలో చిక్కుకున్న రైతులను హెలికాప్టర్లలో తీసుకొచ్చిన దృశ్యాలు చూడండి..

Heavy Rains

Updated On : August 28, 2025 / 2:57 PM IST

Heavy Rains: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వద్ద మానేరువాగు మధ్యలో చిక్కుకున్న ఐదుగురు రైతులను రెస్క్యూ బృందాలు కాపాడాయి. పశువులు మేపేందుకు వెళ్లిన ఆ ఐదుగురు అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ చొరవ తీసుకుని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వైమానికదళ హెలికాప్టర్‌లు పంపాలని కోరడంతో రాజ్‌నాథ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారు.

రెండు హెలికాప్టర్లు రావడంతో రైతులను అక్కడి నుంచి వాటిలో బయటకి తీసుకొచ్చారు. రైతులు క్షేమంగా రావడంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. (Heavy Rains)

Also Read: డబ్బులుంటే ఇష్టం వచ్చినట్లు చేస్తారా? అంటూ రఘురామ కృష్ణంరాజుపై ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ఘాటు వ్యాఖ్యలు..

కాగా, గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపేందుకు నిన్న ఐదుగురు వ్యక్తులు వెళ్లారు. ఎగువ మానేరు వద్ద చిక్కుకున్నారు. దీంతో సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు బండి సంజయ్ ఫోన్ చేసి, బాధితులను ఆదుకోవాలని, యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు.

నిన్న మధ్యాహ్నం నుంచి రైతులు వాగులోని ఎత్తైన గడ్డ మీదే ఉన్నారు. వారికి నిన్నటి నుంచి డ్రోన్‌ ద్వారా ఆహారం అందించారు. మరోవైపు, కామారెడ్డి జిల్లాలోనూ వరదల్లో చాలా మంది చిక్కుకున్నారు.