Krishna River Ownership Board Meeting Tomorrow 3107
రేపు కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. వాదనలు వినిపించేందుకు
ఏపీ, తెలంగాణ అధికారులు సిద్ధమయ్యారు. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఏపీ తన ఎజెండాను పంపింది. సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి నీటి విడుదలతో ఏపీ నష్టపోతుందని అందులో తెలిపింది. కృష్ణా నది యాజమాన్య బోర్డును విజయవాడకు తరలించాలని డిమాండ్ చేసింది.
కృష్ణా నదిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే వరద జలాలు వచ్చినప్పుడు వాడుకున్న నీటిని లెక్కించవద్దని ఏపీ తన ఎజెండాలో పొందుపరిచింది. ఏపీ తప్పుజేస్తున్నట్లుగా తెలంగాణ ఆరోపిస్తున్న నేపథ్యంలో అవే అంశాలుగా ఎజెండాగా రూపొందించారు.
నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కే సంబంధించి నీటి వాడకంలో తెలంగాణ ఇష్టారాజ్యంగా చేస్తున్న వ్యవహారాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. కృష్ణా నదిపై తెలంగాణ అనుమతి లేకుండా కట్టిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఎజెండాలో చేర్చారు.
ప్రధానంగా ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు ఏపీలో వరద నీరు. అంటే వృథాగా సముద్రంలోకి వెళ్లేటటువంటి నీటిని వాడుకోవడం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లుతుందనేదానిపై ప్రధానంగా చర్చించారున.
దాదాపు 2 వేల టీఎంసీల నీరు గత ఏడాది సముద్రంలో కలిసిపోయింది. కాబట్టి ఇటువంటి నీటిని వాడుకోవడం వల్ల కరువు ప్రాంతమైన రాయలసీమను ఆదుకునే అవకాశం ఉందన్నారు. తద్వారా వృథాగా పోయే నీటిని వాడుకోవడం ద్వారా రాయలసీమ ప్రాంతానికి మేలు జరుగుంది కానీ తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి నష్టం కల్గదని ఎజెండాల్లో చర్చించారు.