Mobile Phones Recovery Fair : కర్నూలులో పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్ల రికవరీ.. లాస్ట్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ యాప్‌తో గుర్తింపు

కర్నూలు జిల్లా పోలీసులు మొబైల్‌ ఫోన్స్‌ రికవరీ మేళా నిర్వహించారు. దొంగల చేతుల్లోకి వెళ్లిన 560 ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని పోగొట్టుకున్న వారికి అందజేశారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మొబైల్స్ పోగొట్టుకున్న వారి కోసం కంప్లైంట్‌ రిజిస్టర్‌ యాప్‌ను ప్రారంభించారు.

Mobile Phones Recovery Fair : కర్నూలు జిల్లా పోలీసులు మొబైల్‌ ఫోన్స్‌ రికవరీ మేళా నిర్వహించారు. దొంగల చేతుల్లోకి వెళ్లిన 560 ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని పోగొట్టుకున్న వారికి అందజేశారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మొబైల్స్ పోగొట్టుకున్న వారి కోసం కంప్లైంట్‌ రిజిస్టర్‌ యాప్‌ను ప్రారంభించారు.

Mobile Phones Stolen: రూ.7కోట్ల విలువైన సెల్ ఫోన్లు చోరీ

యాప్‌లో వివరాలు రిజిస్టర్‌ అయిన వెంటనే.. పోయిన మొబైల్‌ ఫోన్‌ కోసం ట్రాకింగ్‌ ప్రారంభిస్తారు. దానిని ఎవరు వాడుతున్నారో గుర్తించి స్వాధీనం చేసుకుంటారు. సెల్‌ ఫోన్‌ పోతే గతంలో పోలీస్‌ స్టేషన్‌ల్‌లో ఫిర్యాదు చేసి.. మీసేవ కేంద్రంలో ఫీజు చెల్లించాల్సి వచ్చేది. పోయిన ఫోన్ ఎక్కడున్నా ట్రాక్‌ చేసే విధంగా టెక్నాలజీ రూపొందించారు.

ట్రెండింగ్ వార్తలు