Mobile Phones Stolen: రూ.7కోట్ల విలువైన సెల్ ఫోన్లు చోరీ

బెంగళూరుకు వెళ్తున్న మొబైల్ ట్రక్ చోరీకి గురైంది. దాదాపు రూ.7 కోట్లు విలువ చేసే 9వేల మొబైల్ ఫోన్లు అందులో ఉన్నట్లు ఆరోపిస్తున్నారు.

Mobile Phones Stolen: రూ.7కోట్ల విలువైన సెల్ ఫోన్లు చోరీ

Oppo

Updated On : October 17, 2021 / 3:01 PM IST

Mobile Phones Stolen: బెంగళూరుకు వెళ్తున్న మొబైల్ ట్రక్ చోరీకి గురైంది. దాదాపు రూ.7 కోట్లు విలువ చేసే 9వేల మొబైల్ ఫోన్లు అందులో ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ ను దారుణంగా కొట్టి వాహనం నుంచి తోసేసి ఉడాయించినట్లు పోలీసులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలో అక్టోబర్ 5న ఘటన జరిగినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఒప్పో మొబైల్ కంపెనీ మేనేజర్ సచిన్ మానవ్ ఫిర్యాదు చేశఆరు. ఫారుఖాబాద్ జిల్లాకు చెందిన డ్రైవర్ మునీశ్ యాదవ్ అక్టోబర్ 5న ఉదయం సమయంలో బయల్దేరాడు. ట్రక్కులో మొబైల్ ఫోన్లు లోడ్ చేసుకుని ఇద్దరిని ఎక్కించుకుని గ్వాలియర్ బైపాస్ మీదుగా వెళ్లాడు.

ఘటనానంతరం ట్రక్కును మన్పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ కు ప్రత్యేక పోలీసుల బృందం ఏర్పాటైంది. స్థానికంగా ఉన్న సీసీటీవీలను పర్యవేక్షించి నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.

………………………………………… : నెటిజన్లపై సీరియస్ అయిన మంచు లక్ష్మి..