Kurnool Accident: పురిటి కాన్పు కోసం పుట్టింటికి వెళ్తుంటే.. బస్సు కిందపడి చనిపోయింది.. కర్నూలు జిల్లాలో ఘోరం

పురిటి కాన్పు కోసం కన్నవారింటికి వెళ్తున్న ఒక గర్భిణిని రోడ్డు(Kurnool Accident) ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.

Kurnool road accident five month pregnant woman killed at panchalingala checkpost

  • రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృతి.
  • పుట్టింటికి వెళ్తుండగా ఘోర విషాదం.
  • బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోయింది

Kurnool Accident: పురిటి కాన్పు కోసం కన్నవారింటికి వెళ్తున్న ఒక గర్భిణిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కర్నూలు నగర సమీపంలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద శనివారం జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బైక్‌పై వెళ్తున్న తండ్రీకూతుళ్లను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.

Cm Chandrababu: రౌడీయిజం చేస్తే వదిలిపెట్టను.. గుడివాడ సభలో సీఎం చంద్రబాబు హెచ్చరిక!

పుట్టింటికి వెళ్తుండగా విషాదం.. కుటుంబంలో తీరని శోకం:

కర్నూలు జిల్లా గడివేములకు చెందిన ప్రియాంకకు, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బజారితో వివాహమైంది. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అయిన ప్రియాంకను ఆమె తండ్రి రాముడు ద్విచక్ర వాహనంపై పుట్టింటికి తీసుకెళ్తుండగా, పంచలింగాల వద్ద బైక్ అదుపుతప్పింది. దీంతో ఇద్దరూ కిందపడగా, వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు(Kurnool Accident) ప్రియాంకపై నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన తండ్రి రాముడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.