Kuyyeru Mother Daughter Incident : కాకినాడ జిల్లా కుయ్యేరులో ఉదయం నుంచి నెలకొన్న హైడ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. ఎట్టకేలకు తల్లీకూతుళ్లను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఉదయం నుంచి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు, గ్రామ పంచాయితీ సిబ్బంది, ఏఎన్ ఎంలు ప్రయత్నించినప్పటికీ ఎంతకూ వినలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతం అయ్యింది. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఆ తల్లీకూతుళ్లను బయటకి తీసుకొచ్చారు. వారికి సర్ది చెప్పి ఆసుపత్రికి తరలించారు.
మూడేళ్లు మూల గదిలోనే జీవితం. పగటి పూట బయటకు వెళ్లని పరిస్థితి. చుట్టుపక్కల వ్యక్తులను అసలు పలకరించరు. కనీసం వారిని చూసింది కూడా లేదంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మంత్రాలు, తాంత్రిక పూజలు చేస్తున్నారంటూ చెబుతారు. కరోనా సమయం నుంచి తల్లీకూతుళ్లు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
దాదాపు మూడేళ్లుగా కనీసం ఇంట్లో నుంచి కూడా బయటకు రావడం లేదు. ఒకే గదిలో తల్లీకూతుళ్లు అది కూడా దుప్పటి కప్పుకుని గడుపుతున్నారు. వాళ్ల నాన్నే ఆహారం వండి తల్లీకూతుళ్లకు వండి పెడుతున్నాడు. అతను కూడా ఎంత చెప్పినా.. వాళ్లు మాత్రం వామ్మో మేము బయటకు రాలేం అంటున్నారు మణి ఆమె కూతురు దుర్గా భవానీ. కాకినాడ జిల్లా కుయ్యేరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇంటి నుంచి బయటికి వస్తే తమకు ఏదో జరిగిపోతుందని ఆ తల్లీకూతుళ్లు భయంలో ఉండిపోయారు. చేతబడి, బాణామతి చేస్తారేమోనని భయాందోళన చెందారు.
భయం..భయం.. దీనిని మించిన మానసిక సమస్య ప్రపంచంలో ఏదీ లేదన్నది నిత్య సత్యం. ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ మీద నడుస్తోంది. మనిషి.. స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నాయి. అలాంటి ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలు రాజ్యమేలుతుండటం విస్మయానికి గురి చేస్తోంది. ఆ మూఢ నమ్మకాలు ఎక్కువయ్యాయి మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి.
కాకినాడ జిల్లా కుయ్యేరు గ్రామంలో సరిగ్గా ఇదే జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వస్తే తమకేదో జరిగిపోతుందనే భయంలో తల్లీకూతుళ్లు ఉన్నారు. చేతబడి, బాణామతి చేస్తారేమోనని భయపడుతున్నారు. గతంలోనూ తమను బయటకి తీసుకెళ్లి చేతబడి చేశారని కుమార్తె దుర్గాభవానీ అంటోంది. కాగా, కరోనా భయంతోనే వారిలా చేస్తున్నారని కొంతమంది అంటుండగా, అక్కడ పరిస్థితులను చూస్తే.. వారు తీవ్ర భయంతో, మానసిక ఇబ్బందులతో వారిలా చేస్తున్నారని అర్థమవుతోంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
దీనికి తోడు వారికి భక్తి కూడా ఎక్కువగా ఉండటంతో ఇంట్లోని దృశ్యాలను బట్టి తెలుస్తుంది. ఇంటి నిండా మతాలకు సంబంధించిన ఫోటోలు, బుక్స్ ఉన్నాయి. భవానీ.. బైబిల్, ఖురాన్ చదువుతోంది. దీంతో మతాలకు సంబంధించిన మూఢ నమ్మకాలతో, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తల్లీకూతుళ్ల వైఖరిని బట్టి తెలుస్తోంది.