Anantapur Family Lockdown : అనంతపురంలో రెండేళ్లుగా లాక్‌డౌన్‌లోనే ఉన్న కుటుంబం కథ సుఖాంతం.. చీకటి నుంచి వెలుగులోకి ఆ ముగ్గురు

అనంతపురంలో వింత జీవితం గడుపుతున్న ముగ్గురు కుటుంబసభ్యులను(అక్క, చెల్లి, తమ్ముడు) బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చారు పోలీసులు. అమ్మా, నాన్న చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి రెండేళ్లుగా ఇంటికే పరిమితమైన ముగ్గురు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి బయటకు వచ్చేలా చేశారు పోలీసులు.

Anantapur Family Lockdown : అనంతపురంలో రెండేళ్లుగా లాక్‌డౌన్‌లోనే ఉన్న కుటుంబం కథ సుఖాంతం.. చీకటి నుంచి వెలుగులోకి ఆ ముగ్గురు

Updated On : September 18, 2022 / 7:53 PM IST

Anantapur Family Lockdown : అనంతపురంలో వింత జీవితం గడుపుతున్న ముగ్గురు కుటుంబసభ్యులను(అక్క, చెల్లి, తమ్ముడు) బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చారు పోలీసులు. అమ్మా, నాన్న చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి రెండేళ్లుగా ఇంటికే పరిమితమైన ముగ్గురు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి బయటకు వచ్చేలా చేశారు పోలీసులు. బూజు పట్టిన ఇల్లు, జడలు కట్టిన జుట్టుతో దర్గంధం వెదజల్లుతూ స్మశానాన్ని తలపించిన వాతావరణం నుంచి సామాన్య జనంలో కలిసేలా చర్యలు తీసుకున్నారు.

అనంతపురంలోని వేణుగోపాల్ నగర్ లో ఓ ఇంట్లో ముగ్గురు కుటుంసభ్యులు ఉన్న కుటుంబం గత రెండేళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా గడుపుతున్నారు. తల్లిదండ్రులు కొన్నాళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి వారు డిప్రెషన్ లోకి వెళ్లారు. ఇంటి తలుపులు వేసినవి వేసినట్టే ఉంటున్నాయి. ఇంటికెవరూ రావడం లేదు. ఇంటి నుంచి ఉలుకూ లేదు పలుకూ లేదు. కరెంట్ కూడా లేదు. అయినా అలాగే కాలం వెళ్లతీస్తున్నారు.

ఇంటిని శుభ్రం చేయలేదు. కనీసం స్నానం కూడా చేయలేదు. జట్టు పెరిగి జడలుగా అట్ట కట్టాయి. గోళ్లు విపరీతంగా పెరిగాయి. ఇళ్లంతా దుర్గంధం. ఆ స్మెల్ అంతా పక్కింటి వారికి వ్యాపించడంతో కార్పొరేషన్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన కార్పొరేషన్ సిబ్బంది విషయం ఏంటని ఆరా తీస్తే దిమ్మతిరిగిపోయే నిజం వెలుగుచూసింది. కార్పొరేషన్ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో, లోకల్ కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారంతా వీరికి ధైర్యం చెప్పి మళ్లీ సాధారణ జీవితం గడిపేలా చర్యలు తీసుకున్నారు. వారికి అవసరమైన నిత్యావసరాలతో పాటు కార్పొరేషన్ సిబ్బందితో ఇంటిని శుభ్రం చేయించారు. కేవలం డిప్రెషన్ వల్లే వారు ఇలా ప్రవర్తించారని, ఇక నుంచి నార్మల్ గానే ఉంటారని డీఎస్పీ శ్రీనివాసులు చెప్పారు.

నిన్నటి వరకు చీకట్లో మగ్గిన వారు కూడా ఇక నుంచి సాధారణ జీవితం గడుపుతామని చెబుతున్నారు. పోలీసులు, కార్పొరేటర్ తీసుకున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.