Laptop distribution in AP: విద్యార్థుల కోసం జగన్ ప్రభుత్వం ల్యాప్‌టాప్ పంపిణీ

జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాప్‌టాప్‌ల పంపిణీ చేపట్టింది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండరు నోటీస్ జారీ చేయాలని ప్రకటించింది.

Laptop Sales

Laptop distribution in AP: జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాప్‌టాప్‌ల పంపిణీ చేపట్టింది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండరు నోటీస్ జారీ చేయాలని ప్రకటించింది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు టెండరు విలువ రూ.100 కోట్లు దాటడంతో టెండరు నోటీసులోని అంశాలను న్యాయసమీక్షకు పంపించింది.

బేసిక్ కాన్ఫిగరేషన్‌తో 5.62 లక్షల ల్యాప్‌టాప్‌లు, లేటెస్ట్ కాన్ఫిగరేషన్‌తో 90వేల 926 ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్లు పిలవనున్నారు. సరఫరా కోసం బిడ్లు దాఖలు చేయాల్సిందిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కోరింది. ఈ టెండర్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేయాల్సిందిగా ప్రజలను కోరుతూ ప్రకటన విడుదల చేసింది.

సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటల్లోగా ఏపీ జ్యూడీషియల్ ప్రివ్యూ ఎట్ జీమెయిల్ డాట్ కామ్​apjudicialpreview@gmail.comకు అభ్యంతరాలు, సూచనలు, సలహాలను పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Sai Dharam Tej: యాక్సిడెంట్‌కు గురైన బైక్ విలువెంతో తెలుసా..