AP Census 2027 : ఏపీలో ప్రారంభమైన జనగణన.. ఫోన్ నుంచే మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.. ఏం ప్రశ్నలు అడుగుతారంటే
AP Census 2027 : ఏపీలో జనగణన తొలి దశ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. ఈసారి జనగణన ప్రత్యేకతలు ఏంటి.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే..
Andhra Pradesh Census 2027 Digital House Listing Starts On 16 april full details here
AP Census 2027 : జనగణన 2027 తొలి దశ ఏప్రిల్ 16, గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. దేశ చరిత్రలో మొదటిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించే జనగణనగా ఇది సరికొత్త రికార్డు క్రియేట్ చేయనుంది. జనగణనలో భాగంగా ఏపీలోని ప్రజలకు 15 రోజుల స్వీయ-లెక్కింపు (Self-Enumeration) అవకాశం కల్పించారు. దీని ద్వారా ప్రజలు క్యూలలో నిలబడకుండా ఆన్లైన్లోనే తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
- స్వీయ-లెక్కింపు గడువు: ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు
- ఎన్యుమరేటర్ల ఫీల్డ్ సందర్శనలు: మే 1 నుంచి మే 30, 2026 వరకు
- జనాభా లెక్కింపు: ఫిబ్రవరి 2027
స్వీయ లెక్కింపు పోర్టల్..
జనగణనను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రజలు గురువారం నుంచి se.census.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి వారి వివరాలను నమోదు చేయవచ్చు. ఈ ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్ వల్ల జనాలు ఇంటి నుంచే సులభంగా తమ వివరాలు సమర్పించవచ్చు. ప్రత్యక్ష విధానంలో ప్రభుత్వ సిబ్బంది ఎంట్రీల్లో వచ్చే తప్పులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఇలా నమోదు చేసుకున్న వారికి ఒక ప్రత్యేక ఐడీ (Self Enumeration ID) లభిస్తుంది. సెన్సస్ సిబ్బంది వెరిఫికేషన్ కోసం ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని వారికి చూపిస్తే సరిపోతుంది.
ఏ సమాచారం సేకరిస్తున్నారు
మొదటి దశలో గృహ జాబితా, ఇళ్ల జనగణనపై దృష్టి సారించారు. రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె. నివాస్ తెలిపిన వివరాల ప్రకారం సుమారు 33 ప్రశ్నలు అడగనున్నారు.
- గృహ పరిస్థితులు: ఇంటి నిర్మాణం, యాజమాన్యం.
- మౌలిక సదుపాయాలు: తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం అందుబాటు.
- గృహ ఆస్తులు: వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కమ్యూనికేషన్ సాధనాలు.
భారీగా ఏర్పాట్లు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనగణన ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. 100 శాతం కవరేజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో సిబ్బందిని మోహరించింది. జనగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు కలిపి మొత్తంగా 1.1 లక్షల సిబ్బందిని నియమించింది. అలానే గ్రామ/వార్డు సచివాలయాల సమన్వయంతో స్థానిక స్థాయిలో డేటా ధృవీకరణ జరపనున్నారు. ఈ జనగణనలో భాగంగా మొదటిసారిగా సరిహద్దులను డిజిటల్‌గా మ్యాప్ చేసి ఎలాంటి గృహాలు మిస్సవకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా డిజిటల్ మ్యాపింగ్ విధానం అమలు చేస్తున్నారు.
జనగణన ప్రాముఖ్యత:
చివరిసారి 2011లో జనగణన జరిగింది. అప్పటి నుంచి దేశ జనాభా నిర్మాణంలో పెద్ద మార్పులు వచ్చాయి. 2027 జనగణన డేటా ప్రభుత్వానికి అనేక రంగాల్లో కీలకంగా ఉపయోగపడనుంది.
- సంక్షేమ పథకాలు: లబ్ధిదారుల గుర్తింపు.
- మౌలిక వసతులు: పాఠశాలలు, ఆసుపత్రులు, నీటి పైపులైన్ల ప్రణాళిక.
- డీలిమిటేషన్: రాజకీయ నియోజకవర్గాల పునర్విభజన.
