Lavu Sri Krishna Devarayalu
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దీనికి హాజరైన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తాము ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పలు అంశాలపై పార్లమెంట్‌లో చర్చించాలని కోరినట్లు చెప్పారు.
ఏపీలోని పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ మొదటికి రావడంపై సభలో చర్చించాలని కోరినట్లు తెలిపారు. అలాగే, ఆయిల్ రిఫైనరీతో పాటు కడప స్టీల్‌ప్లాంట్ వంటి అంశాలపై కేంద్ర సర్కారు అభిప్రాయాన్ని తెలపాలని కోరినట్లు చెప్పారు. విజయవాడ వరదలను దృష్టిలో పెట్టుకుని నగరాల్లో వరదలు వచ్చిన వేళ చేపట్టాల్సిన చర్యలుపై చర్చించాలని అన్నామని తెలిపారు.
అలాగే, గోదావరి, పెన్నా నదుల అనుసంధానంపై చర్చించాలని చెప్పినట్లు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని, అందుకోసం కఠినతర చట్టం తీసుకురావాలని కోరినట్లు చెప్పారు. రేపటి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో.. అదానీ గ్రూప్‌పై అమెరికా చేస్తున్న లంచం ఆరోపణలపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అలాగే, మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలని అంటోంది.
వైఎస్ జగన్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు: ఆనం వెంకటరమణారెడ్డి