ఉచిత దర్శనం ఎక్కడ ? ఇంద్రకీలాద్రిపై వీఐపీలకే పెద్దపీట, సామాన్యులకు దక్కని దుర్గమ్మ దర్శనం

  • Publish Date - October 19, 2020 / 11:51 AM IST

indrakeeladri durgamma temple : విజయవాడలోని ప్రముఖ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. కానీ..అమ్మవారిని దర్శించుకోవడం విషయంలో వీఐపీలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గమ్మ దర్శనం కలగడం లేదని సామాన్యులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.



గత రెండు రోజులుగా ఉచిత దర్శనానికి మంగళం పలుకుతున్నారు. 100, 300, 500 రూపాయలతో కరెంటు బుకింగ్ అంటూ మూడు కౌంటర్ల ద్వారా టికెట్ల విక్రయాలు జరిపారు. ఉచిత దర్శనానికి వచ్చిన భక్తులను వెనక్కి పంపుతున్నారు. కరోనా దృష్ట్యా దర్శనం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. మరి డబ్బులకు టికెట్లు ఎలా విక్రయిస్తున్నారంటూ…భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు…ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం దుర్గమ్మ తల్లి శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆమె దివ్య మంగళరూపాన్ని దర్శించుకొనేందుకు భక్తులు కొండపైకి తరలివస్తున్నారు.



తెల్లవారుజాము నుంచే దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఔబెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలు కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. దుర్గమ్మ సన్నిధిలోని దసరా వేడుకలకు ఎన్నో చారిత్రక.. పురాణ.. ఇతిహాస విశేషాలున్నాయి.

ట్రెండింగ్ వార్తలు