నిరూపించలేకపోయారు : వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు – నారా లోకేష్

  • Publish Date - November 22, 2019 / 07:49 AM IST

రాజధాని భూముల విషయంలో తనపై చేసిన ఆరోపణలను వైసీపీ నిరూపించలేకపోయిందని, వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. 2019, నవంబర్ 22వ తేదీన ప్రత్తిపాడు, నరసరావుపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

రాజధాని నిర్మాణంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు..రాజధానికి మొదట ఆమోదం తెలిపి..ఇప్పుడు ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు బాబును ఏమి చేయలేకే నాపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇదే పాలన కొనసాగితే ఏపీ అంధకారంలోకి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. 
మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధిని పరిచయం చేసిన నేత ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుగారి 18వ వర్దంతి సందర్భంగా నివాళులర్పించినట్లు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. కోటేశ్వరరావు సామాన్య కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తీరు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామన్నారు నారా లోకేష్. 

Read More : వైసీపీది అప్పుడొకమాట..ఇప్పుడొకమాట : విద్యా వ్యవస్థపై చర్చిద్దామా బోండా ఉమ సవాల్

కొన్ని రోజులుగా అమరావతి భూముల విషయంలో వైసీపీ, టీడీపీ నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అవసరమైన దానికన్నా ఎక్కువ భూములను అటు రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది. రాజధాని విషయంలో మంత్రి బోత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శివరామకృష్ణ కమిటీ సూచనలను పట్టించుకోలేదని, అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.