Leopard: కలకలం రేపుతున్న చిరుత.. వివరాలు తెలిపిన ఇన్‌ఛార్జి డీఎఫ్ఓ భరణి

ప్రజలు బయటకు రావడాన్ని పరిమితం చేస్తున్నామని చెప్పారు. చిరుత పాదముద్రలు గుర్తిస్తే వెంటనే..

Representative image

ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. దివాన్ చెరువుతో పాటు లాలా చెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతాల్లో అది తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇన్‌ఛార్జి డీఎఫ్ఓ భరణి దీనిపై మాట్లాడుతూ.. వర్షం వల్ల చిరుత పాదముద్రలు కనపడటంలేదని, ఆటోనగర్ ప్రాంతంలో చిరుత జాడ కనిపించిందని తెలిపారు.

ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు రికార్డ్ అయ్యాయని చెప్పారు. జంతువుల అరుపుల ఆధారంగా ట్రాప్ కెమెరాలు పెట్టామని, నాలుగు ట్రాప్ కేజీలు ఏర్పాటు చేశామని వివరించారు. చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, వారం రోజులపాటు పుష్కర నగరవనాన్ని మూసేస్తున్నామని అన్నారు.

ప్రజలు బయటకు రావడాన్ని పరిమితం చేస్తున్నామని చెప్పారు. చిరుత పాదముద్రలు గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాంప్లెట్స్ ద్వారా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఒకటే ఉందా? అంతకంటే ఎక్కువ ఉన్నాయా? అనే విషయాలపై కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. దివాన్ చెరువు ఆర్ఎఫ్ లోనే చిరుత పులి సంచరిస్తుందని అన్నారు. పొలంలో పడుకునేవారు కొన్ని రోజులు పాటు అక్కడ పడుకోవద్దని చెప్పారు.

 Also Read: డ్రగ్స్ వాడితే ఉపేక్షించేది లేదు.. 5 ప్రధాన పబ్బులపై ఏకకాలంలో దాడులు..

ట్రెండింగ్ వార్తలు