LG Polymers Gas Leakage..డాక్టర్ల సూచనలు

  • Publish Date - May 8, 2020 / 01:44 AM IST

విశాఖపట్టణంలో LG Polymers Gas Leakage ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి వెలువడిన విష వాయువుల వల్ల విశాఖ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ విష వాయువు పీల్చి అనేక మంది..రోడ్లపైకి వచ్చి..భయానక స్థితిలో ఉండిపోయారు. దీని నుంచి లీక్ అయిన..గ్యాస్ చాలా ప్రమాదకరయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన గ్యాస్‌ను పీవీసీ గ్యాస్‌ లేక స్టెరిన్‌ గ్యాస్‌ అంటుంటారు. 

లీకైన క్షణాల్లోనే మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, దీనికారణంగా..బాధితుడికి వెంటనే చికిత్స అందకపోతే ప్రాణాలు పోతాయని వెల్లడిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గ్యాస్ లీక్ కారణంగా రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. పాలిమర్స్ ప్రభావవ 48 గంటల పాటు ఉంటుందని, తప్పనిసరిగా..మాస్క్ లేదా..తడిబట్ట ముఖానికి ధరించాలంటున్నారు.

ఇంట్లో ఉన్నా సరే..మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. గ్యాస్ ప్రభావం తగ్గించడానికి పాలు తాగాలని, ఒకవేళ కళ్ల మంట అనిపిస్తే.. ఐ డ్రాప్స్ వేసుకోవాలన్నారు. నీరసంగా అనిపిస్తే..సిట్రిజన్ టాబ్లెట్ వేసుకోవాలని, వాంతి వచ్చినట్లు అనిపిస్తే.. డోమ్ స్టల్ టాబ్లెట్ వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

ఎల్‌జీ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్‌ నెంబర్లు 7997952301… 8919239341 అందించారు. అలాగే మరో అధికారి ఆర్‌ బ్రహ్మ అందుబాటులో ఉన్నారని (9701197069) ఆయన్ను కూడా సంప్రదించవచ్చని ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

 

Also Read | విశాఖలో LG Polymers Gas Leakage.. ఫేక్ వార్తలు నమ్మొద్దు