లైఫ్ స్టైల్ తీసుకొస్తున్న జబ్బులు.. ఫోకస్ పెట్టిన స్టేట్ గవర్నమెంట్

Lifestyle: లైఫ్ స్టైల్‌లో మార్పుల వల్ల వచ్చే జబ్బులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. బిజీబిజీ లైఫ్‌లో ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌పై ఫోకస్ పెట్టకపోవడం తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోంది. దేశంలో మొత్తం మృతుల్లో 63 శాతం మంది నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌‌తోనే మృతి చెందుతున్నట్టు తాజాగా సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. దీనిపై రాష్ట్రాలన్నీ అలర్ట్ కావాలని వార్నింగ్ ఇచ్చింది. డయాబెటిస్, గుండెసమస్యలు, క్యాన్సర్, స్ట్రోక్స్‌ వంటి లైఫ్‌స్టైల్ జబ్బులతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపింది.

వాటిని నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. కొవిడ్‌ సోకిన వారిలోనూ ఎక్కువ మంది ఈ అసాంక్రమిక వ్యాధి బాధితులే మృతిచెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా పలు రాష్ట్రాల్లో పొగ తాగడం, మద్యం, హానికర తిండి తినడం, శారీరక శ్రమ లేకపోవడం లైఫ్‌స్టైల్ జబ్బులకు ప్రధాన కారణాలు. చాలామందికి వ్యాయామంపై అవగాహన లేకపోవడం కూడా వ్యాధులకు కారణమై స్థూలకాయం కారణంతో చాలామంది రక్తంలో చక్కెర నిల్వలు పేరుకుపోతున్నాయి.

లైఫ్ స్టైల్ జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2 నెలల నుంచి ఇంటింటి సర్వే జరుగుతోంది. ఓపెన్‌ డేటా కిట్‌ పేరుతో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో నిర్వహిస్తున్న ఈ సర్వే ఇప్పటికే 72 శాతానికిపైగా పూర్తయింది. సుమారు 19 వేలమంది ఏఎన్‌ఎంలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. డయాబెటిస్, బీపీ, క్యాన్సర్, లెప్రసీ వంటి జబ్బులపై ప్రాథమిక లక్షణాలను గుర్తిస్తూ ఈ సర్వే సాగుతోంది.

పర్సన్ హైట్, వెయిట్, బీపీ, బయోకెమికల్‌ అంచనాలు, తినకముందు రక్తంలో షుగర్ లెవల్స్, యూరినరీ సోడియం పరిమాణం వంటివి నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 15 ఏళ్ల వయసు దాటిన వారిలో 14.2 శాతంమంది పొగ తాగుతున్నారు. 21.4 శాతం మంది పొగలేని పొగాకును వాడుతున్నారు. 18 శాతం మంది హైపర్‌ టెన్షన్‌‌తో, 13 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు.