లిక్కర్ కేసు లింకులు ఎక్కడ దాకా? వెలుగులోకి వస్తున్న కొత్త కొత్త పేర్లు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు మించి ఏపీలో దోపిడీ జరిగిందని..వైసీపీ కీలక నేతలకు సంబంధాలున్నాయని ఆరోపిస్తోంది. అప్పుడే అయిపోలేదు..ఇప్పుడే మొదలైందంటూ తెలుగు తమ్ముళ్లు సినిమా డైలాగులు కొడుతున్నారు.

MP Mithun Reddy
AP Liquor Scam: లిక్కర్ ఫైల్స్..కంటిన్యూస్. ఎవ్రీ డే ఒక అప్డేట్. ప్రతీ వారానికో కొత్త లింకు బయటికి వస్తుండటంతో..ఎప్పకప్పుడు న్యూ ఇష్యూగా లైమ్‌లైట్‌లో ఉంటూ వస్తోంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసు. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. నిందితులకు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టులో సవాల్ చేసింది సిట్.
అయితే నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో లేరు కాబట్టి ఇపుడు జోక్యం చేసుకోలేమని చెప్పింది హైకోర్టు. అయితే మిగతా నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కోరింది సిట్. నిందితులు బయటికి వస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని కోరడంతో మిగతా వారికి బెయిల్ ఇవ్వకుండా ఆర్డర్స్ ఇస్తామని హైకోర్టు తెలిపింది. అయితే ఇప్పటికే బెయిల్‌పై రిలీజ్ అయిన ముగ్గురు నిందితులకు నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.
ఏయే నేతలకు ఈ స్కామ్‌తో సంబంధం ఉంది?
మరోవైపు లిక్కర్ కేసులో కొత్త కొత్త విషయాలు..లింకులు బయటకొస్తున్నాయి. ఏ ప్రాంతం నుంచి ఏ నేతకు ఈ స్కామ్‌తో సంబంధం ఉందనే దానిపై రకరకాల చర్చ జరుగుతోంది. లీకులు చక్కర్లు కొడుతున్నాయి. కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తుండటంతో కేసు విచారణ అంతులేని కథలా సాగుతోంది. మరో నలుగురు కీలక వైసీపీ నేతలకు లిక్కర్ ముడుపులు అందినట్టు సిట్ విచారణలో గుర్తించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వైసీపీ కీలకనేత మేనల్లుడితో పాటు ఇద్దరు మాజీమంత్రులు, మరో మాజీ ఎమ్మెల్యేల పేర్లు లిక్కర్ కేసులో ప్రచారం జరుగుతున్నాయి. దీంతో ఎవరెవరి నుంచి ఎవరెవరు ఎంత వరకు తీసుకున్నారనే దానిపై సిట్ అధికారులు పూర్తి డిటేయిల్స్ రాబడుతున్నారట. త్వరలోనే ఇద్దరు మాజీ మంత్రులు, ఓ మాజీ ఎమ్మెల్యే మరో కీలక వైసీపీ నేతకు నోటీసులిచ్చి విచారించే అవకాశం ఉందంటున్నారు.
Also Read: ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ.. ఆ పదిమందిలో నలుగురిపై వేటు పడటం ఖాయమా? రిజైన్ చేస్తారా?
ఇలా లిక్కర్ కేసు ఎవ్రీ అప్డేట్‌గా మారింది. అయితే ఈ కేసు ఎక్కడికి దారి తీస్తుంది..విచారణ ఎప్పుడు పూర్తి అవుతుంది..ఇంకా ఎవరెవరు ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉందనే దానిపై వైసీపీలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోందట. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లంతా జగన్‌కు సన్నిహితులు..పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్న నేతలే కావడంతో..ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారట ఫ్యాన్ పార్టీ పెద్దలు.
అయితే ఇదంతా పొలిటికల్ డ్రామా అంటోంది వైసీపీ. కూటమి ప్రభుత్వం కావాలని..కట్టు కథను తయారు చేస్తోందని..ఎవరికీ ఏ సంబంధం లేని వారిని లిక్కర్ కేసులో ఇరికించే నోరు మూయించే కుట్ర జరుగుతోందని అంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అసలు లిక్కర్ స్కామే జరగలేదని అంటుంటే..ముడుపులు అంటూ లీకులు వైసీపీ ప్రజల్లో బద్నాం చేయాలనే ప్లాన్‌లో చంద్రబాబు ఉన్నారని అంటోంది వైసీపీ. (AP Liquor Scam)
అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఇది పెద్ద ఆర్థిక కుంభకోణమని.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు మించి ఏపీలో దోపిడీ జరిగిందని..వైసీపీ కీలక నేతలకు సంబంధాలున్నాయని ఆరోపిస్తోంది. అప్పుడే అయిపోలేదు..ఇప్పుడే మొదలైందంటూ తెలుగు తమ్ముళ్లు సినిమా డైలాగులు కొడుతున్నారు. ఓ వైపు సిట్ విచారణ.. బెయిల్ కోసం నిందితుల న్యాయపోరాటం జరుగుతుండగానే..పొలిటికల్ డైలాగ్‌వార్‌కు దారితీస్తోంది లిక్కర్ కేసు. ఈ పరిస్థితుల్లో ఈ కేసు ఎటువైపు దారితీస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.