Somu Veerraju : బీజేపీని గెలిపిస్తే.. రూ.50కే లిక్కర్, మూడేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం..! సోమువీర్రాజు సంచలనం

ఏపీలో కోటి మంది మద్యం తాగుతున్నారు. వాళ్లంతా బీజేపీకి ఓటేసి గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక 75 రూపాయలకే చీప్ లిక్కర్ అమ్ముతాము. ఆదాయం ఇంకా బాగొస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాము

Somu Veerraju

Somu Veerraju : విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలకు ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏపీలో బీజేపీని గెలిపిస్తే 50 రూపాయిలకే చీప్ లిక్కర్ ఇస్తామని ప్రకటించారు.

”ఏపీలో కోటి మంది మద్యం తాగుతున్నారు. వాళ్లంతా బీజేపీకి ఓటేసి గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక 75 రూపాయలకే చీప్ లిక్కర్ అమ్ముతాము. ఆదాయం ఇంకా బాగొస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాము. మంచిది తయారు చేస్తాం” అని సోమువీర్రాజు అన్నారు.

New E-cycles from Hero: దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్లూటూత్ తో వచ్చిన సైకిల్

ఏపీ ప్రభుత్వంపై సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. ప్రభుత్వమే పచ్చి సారా కాస్తూ.. 3 రూపాయల మద్యాన్ని రూ. 25కు కొనుక్కొని.. రూ.250కి విక్రయిస్తున్నారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ పేరుతో చెత్త బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం తాగే వారు కోటి మంది ఉన్నారని.. వారంతా బీజేపీకి ఓటు వేస్తే రూ. 75కే చీప్ లిక్కర్ ఇస్తామని వెల్లడించారు. ఆదాయం బాగుంటే 50 రూపాయిలకే ఇస్తామని హామీ ఇచ్చారు. మద్యం రూపంలో ప్రజలను దోచి మళ్లీ వారికే ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోరికను తీర్చే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని సోము వీర్రాజు అన్నారు.

మరోవైపు రాజధానిలో రైతుల సమస్యలు తీరుస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా బీజేపీ నమ్మిందని.. అందుకే ఇక్కడే తాము రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ను కూడా మంగళగిరిలో నిర్మించిందని వివరించారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం వేల కోట్లు ఇచ్చామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మూడేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సోమువీర్రాజు హామీ ఇచ్చారు.

Oppo A11s : భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!

ప్రాంతీయ పార్టీలన్నీ కమీషన్లతో కాలక్షేపం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వం నిధులిస్తుంటే జగన్, చంద్రబాబు స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకున్నారని సోము వీర్రాజు విమర్శించారు.