Gudivada Amarnath : నెక్స్ట్ జైలుకెళ్లేది లోకేషే.. పవన్ కళ్యాణ్ నకిలీ కాపు : మంత్రి గుడివాడ

ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు వేధిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లడలేదని నిలదీశారు. చిరంజీవిని రాజమండ్రి ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేస్తే ఎందుకు పవన్ ఖండించ లేదని ప్రశ్నించారు.

Gudivada Amarnath – Lokesh : టీడీపీ నేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు సవాల్ విసిరే స్థాయి లోకేష్ కు లేదన్నారు. లోకేష్ స్థాయి ఏమిటి, లోకేష్ బ్రతుకు ఏమిటి అని అన్నారు. ఈడీ, సీఐడీ, ఇన్ కమ్ ట్యాక్స్ చర్చకు రమ్మని పిలుస్తున్నాయని.. వాటికి ముందు సమాధానం చెప్పాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.

రూ.118 కోట్లుకు సంబంధించి ఇన్ కమ్ ట్యాక్స్ పిలిస్తే తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు. పంది కొక్కుకులు తిన్నట్లు రూ.371 కోట్లు ప్రజాధనం తినేసి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఒళ్ళు బలసి లోకేష్ మాట్లాడుతున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ లోకేషే జైల్ కు వెళ్ళేదన్నారు. దేశంలో 4వ రిచ్చెస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి రూ.680 కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.

Ashok Gajapathi Raju : చంద్రబాబు అరెస్టుపై అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ నకిలీ కాపు ఘాటుగా విమర్శించారు. పవన్ చెబితే కాపులు ఎందుకు టీడీపీకి ఓటు వేస్తారని తెలిపారు. కాపులకు చంద్రబాబు చేసింది ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు వేధిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లడలేదని నిలదీశారు. చిరంజీవిని రాజమండ్రి ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేస్తే ఎందుకు పవన్ ఖండించ లేదని ప్రశ్నించారు.

కాపు ప్రముఖులు సమావేశమైతే పవన్ ఎందుకు వెళ్ళలేదని అడిగారు. చంద్రబాబుకు జనసేనను తాకట్టు పెడితే కాపులు టీడీపీకి ఎందుకు ఓట్లు వేస్తారని తెలిపారు. పవన్ సినిమాల్లో యాక్టింగ్, రాజకీయాల్లో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడని పేర్కొన్నారు.

Nara Brahmani: చంద్రబాబు త్వరలోనే బయటకు వచ్చి..: నారా బ్రాహ్మణి

‘మీ పార్టీని టీడీపీలో విలీనం చేసి ఒకే జెండా పెట్టుకోవచ్చు కదా’ అని పవన్ ను ఉద్దేశించి మాట్లాడారు. జన సైనికులు జెండా కూలీలు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక దొంగని కాపాడటానికి తోడు దొంగలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధమని.. రమ్మని చెప్పాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు