ఏపీలో మరో ఆలయంలో విగ్రహం ధ్వంసం

Lord Subrahmanya statue destroyed at Rajamahendravaram :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దుండగులు గతంలో అంతర్వేది రధాన్ని దగ్ధం చేయగా, ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్ధం లో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి పక్కనే ఉన్న కోనేరులో పడేశారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి,  శ్రీరాంనగర్, విఘ్నేశ్వర ఆలయంలోని   కుమారస్వామి విగ్రహం చేతులను గురువారం రాత్రి దుండగలు ధ్వంసం చేశారు.

శుక్రవారం ఉదయం అర్చకులు ఆలయం తలుపులు తెరిచి చూడగా ఈ దుశ్చర్య చూసి పోలీసులకు సమాచారం అందించారు.  ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు పరిస్ధితిని సమీక్షించారు.  క్లూస్ టీంను  రప్పించి వివరాలు సేకరించారు.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.  కాగా టీడీపీ నాయకుడు గన్నికృష్ణ ఈ ఆలయానికి ధర్మకర్తగా  వ్యవహరిస్తున్నారు.