Murder
Daughter Killed Her Mother : విజయనగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్నతల్లినే గొంతు నులిమి చంపేసింది. ముందుగా సహజమరణమని అందరూ భావించారు. కానీ..పోలీసుల దర్యాప్తులో షాకింగ్ న్యూస్ బయటపడింది. దీంతో కూతురు, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. భోగాపురం మండలం సవరవల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
సవరవల్లి గ్రామంలో లక్ష్మీ ఇద్దరు కుమార్తెలున్నారు. చిన్న కుమర్తె ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. పెద్దకుమార్తె రూప శ్రీ ప్రస్తుతం బీ ఫార్మసీ చదువుతోంది. ఈమె చదువుతున్న కాలేజీలో వరుణ్ సాయి కూడా విద్యాభ్యాసం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా..ప్రేమగా మారిపోయింది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం తల్లి లక్ష్మీకి తెలిసింది. వీరిద్దరినీ మందలించింది. ఇప్పటికే చిన్న కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయిందని, ఇలా చేయడం కరెక్టు కాదని కూతురిని హెచ్చరించింది.
తన ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని తొలగించుకోవాలని అనుకుంది రూప శ్రీ. పక్కా ప్లాన్ వేసింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో..ప్రియుడు వరుణ్ సాయిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి..అత్యంత దారుణంగా ఆమె గొంతు నులిమి చంపేశారు. ఏమీ తెలియనట్లుగా నటించారు. సృహ తప్పి పడిపోయిందని చెబుతూ..కొన ఊపిరితో ఉన్న లక్ష్మీని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో ఆమె కన్నుమూసింది. పోస్టుమార్టంలో ఎవరో ఆమెను హత్య చేసినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మే 06వ తేదీన చోటు చేసుకుంది. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. అందులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రియుడు వరుణ్ ..లక్ష్మీ ఇంటికి రావడం..మరలా వెళ్లడం కనిపించాయి. అంతేగాకుండా రూప శ్రీ, వరుణ్ ఫోన్ కాల్స్ ఆరా తీశారు. ప్రేమకు అడ్డుగా ఉందనే కారణంతో..లక్ష్మీని చంపేశారని నిర్ధారించారు. అనంతరం వీరిద్దరినీ అరెస్టు చేశారు.
Read More : Cow Dung: నవ్వాలా.. ఏడవాలా.. ఆవు పేడతో కొవిడ్ తగ్గుతుందా – అఖిలేశ్ యాదవ్