Manchu Vishnu: జగన్ నాకు బావ అవుతారు.. అయినా అన్న అనే పిలుస్తాను -మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.

Manchu Vishnu

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసుకు వెళ్లిన మంచు విష్ణు.. జగన్‌తో భేటీ అనంతరం మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను కలవడం ఇది మూడో సారియని, సినిమా టిక్కెట్ల గురించి ఏం మాట్లాడలేదని చెప్పారు. నాకు వరుసకు బావ అవుతారని, అయినా అన్న అనే పిలుస్తానని అన్నారు. ఇవాళ మీటింగ్ పూర్తిగా పర్సనల్ అని చెప్పారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలు మాకు కావాలి. తెలంగాణ, ఆంధ్రా రెండూ మాకు రెండు కళ్లు. విశాఖలో అవకాశాల కోసం ఫిల్మ్ ఛాంబర్‌లో చర్చిస్తామని అన్నారు. తిరుపతిలో కూడా స్టూడియోలు కట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మొన్న జరిగిన చర్చల్లో మిస్ కమ్యూనికేషన్ జరిగింది. నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది. కానీ, అది ఆయనకు అందజేయలేదు. పేర్ని నాని తో సమావేశంపై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేసింది.

నాకు అన్ని పార్టీల్లోనూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఉన్నారు. టీడీపీలో కూడా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. పేర్ని నాని మా ఇంటికి వస్తే ఆ విషయానికి ఏదో లింక్ చేసి ప్రచారం చేస్తున్నారు. మాకు సపోర్ట్ లేకపోతే ‘మా’ ప్రెసిడెంట్‌గా ఎలా గెలుస్తాను.. ఎన్నికల్లో అందరినీ చిత్తు చిత్తుగా ఓడించాను అని అన్నారు.