Mahanadu: మహానాడు వేదికగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రాథమిక అంశాలు.. ఎన్నికల వేళ ఉత్కంఠ

TDP: టీడీపీ ఈ నెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో మహానాడు నిర్వహించనుంది. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ దీనికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే మహానాడుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మహానాడు వేదికగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో (Manifesto) ప్రాథమిక అంశాలు వెల్లడించనున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).

మహిళలు, రైతులు, యువతకు అధిక ప్రయోజనం చేకూర్చేలా తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టో ఉండనుంది. దసరా నాటికి పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. మహానాడులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే రాజమహేంద్రవరానికి చంద్రబాబు, లోకేశ్ వెళ్తారు.

శుక్రవారం రాజమహేంద్రవరంలో చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతోన్న వేళ ఈ సారి మరింత ప్రతిష్టాతక్మంగా మహానాడును నిర్వహిస్తున్నారు. దాదాపు 25 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.

ఏపీకి సంబంధించిన 15, తెలంగాణకు సంబంధించిన 6 తీర్మానాలు ప్రవేశపెడతారు. నాలుగు ఉమ్మడి తీర్మానాలు ఉంటాయి. ఈ నెల 27న ప్రతినిధుల సభలో తీర్మానాలు ప్రవేశపెడతారు. 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ ఉంటుంది. మహానాడుకు మొత్తం కలిపి 15 లక్షల మంది సభకు హాజరవుతారని టీడీపీ భావిస్తోంది.

Konda Vishweshwar Reddy : ఫేక్ ఓట్లను నిర్మూలించడంలో ఈసీ విఫలం.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్

ట్రెండింగ్ వార్తలు