Vangaveeti Asha Kiran : వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ పొలిటికల్ ఎంట్రీపై బిగ్ అప్డేట్.. విజయవాడలో కార్యాలయం, ఇంటి నిర్మాణం!

Vangaveeti Asha Kiran : వంగవీటి మోహనరంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Vangaveeti Ranga Daughter Asha Kiran Political Entry

Vangaveeti Asha Kiran : వంగవీటి మోహనరంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాధా-రంగా మిత్రమండలి కార్యక్రమాలతో వరుసగా బిజీగా ఉన్న ఆమె.. క్రమంగా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Also Read – Maharashtra : మహిళా రెజ్లర్‌కు వరకట్న వేధింపులు.. పిల్లలతో కలిసి లోయలో దూకి ఆత్మహత్య

తన రాజకీయ కార్యకలాపాలకు అనువుగా విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కృష్ణలంకలో కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు ఆశాకిరణ్ సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు గృహ అవసరాలకోసం కూడా భవనాన్ని నిర్మించుకునేందుకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. కృష్ణలంకలోని కుర్తాళం పీఠం పక్కన పాత పోస్టాఫీసు బజారులో ఉన్న పాత భవనాన్ని ఆశాకిరణ్ కొనుగోలు చేశారు. పాత భవనాన్ని పడగొట్టించి, శుక్రవారం ఆ స్థానంలో నూతన భవన నిర్మాణానికి భూమిపూజ తలపెట్టారు.

రాజకీయ అరంగేట్రం చేయాలన్న ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్మాణం తలపెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరికొద్ది నెలల్లో ఆమె రాజకీయ రంగప్రవేశంపై ప్రకటన చేసే అవకాశం ఉందని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే, ఆమె ఏ రాజకీయ పార్టీ వైపు అడుగులు వేస్తారన్నది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. విజయవాడ కేంద్రంగా రాజకీయాలు చేయటానికి వీలుగా నగరంలోనే నివాసం ఉండాలని ఆశాకిరణ్ భావించినందునే ఇక్కడ ఇంటిని నిర్మించుకుంటున్నట్టుగా ఆమె వర్గీయులు చెబుతున్నారు

రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన తన భవిష్యత్ కార్యాచరణపై ఆశాకిరణ్ ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారన్న అంశం వంగవీటి ఫ్యామిలీ అభిమానుల్లో ఉత్కంఠగా మారింది.