Maharashtra : మహిళా రెజ్లర్కు వరకట్న వేధింపులు.. పిల్లలతో కలిసి లోయలో దూకి ఆత్మహత్య
Wrestler Ashwini Manojhar Pal Suicide : జాతీయ స్థాయిలో రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్న అశ్విని మనోహర్ పాల్ వరకట్న వేధింపులు తట్టుకోలేక తన ముగ్గురు పిల్లలతో కలిసి లోయలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
wrestler ashwini manojhar pal
Wrestler Ashwini Manojhar Pal Suicide : మహారాష్ట్రలో ధారాశివ్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ స్థాయిలో రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్న అశ్విని మనోహర్ పాల్ (30) తన ముగ్గురు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
Also Read : Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది మృతి
అశ్విని జాతీయ స్థాయిలో ఐదు స్వర్ణ, ఆరు రజత పతకాలు గెలుచుకుంది. 2020లో ఆమెకు వివాహం జరిగింది. 2021లో దంపతులకు కుమారుడు జన్మించగా.. 2024లో కవల ఆడపిల్లలు జన్మించారు. అయితే, తాజాగా.. ఆమె తన కుమారుడు, కవల కుమార్తెలతో కలిసి ఖిల్లా నల్దుర్గ్ పైనుంచి 100 అడుగుల లోయలోకి దూకేసింది. ఈ ఘటనలో ముగ్గురు.. తల్లి, ఆమె ఐదున్నరేళ్ల కుమారుడు అజింక్యా, రెండున్నరేళ్ల కవల కుమార్తెల్లో ఒకరైన క్రాంతి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో కుమార్తె వీరా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతొంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కవల పిల్లలు పుట్టిన తర్వాత అత్తింటివారు డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వేధించారని మృతురాలి తండ్రి ఆరోపించారు. ఈ వేధింపులు భరించలేక ఆమె మూడు నెలల క్రితం పుట్టింటికి వచ్చిందని, అయినప్పటికీ ఫోన్ ద్వారా వేధింపులు కొనసాగినట్లు పేర్కొన్నారు.
మృతురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త, మామ, అత్తతో పాటు భర్త తరఫు బంధువుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
