Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది మృతి
Road Accident : కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Road Accident
Road Accident : కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా తమిళనాడుకు చెందిన విద్యార్థులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read : Rain Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక
శుక్రవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గురువాయూర్ వైపు నుంచి కొడుంగల్లూర్ దిశగా వెళ్తున్న కారు.. కైపమంగళం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద హైవేపై నిలిపి ఉంచిన లారీని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో కారులో మొత్తంలో ఎనిమిది మంది ఉండగా.. వారంతా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం త్రిశూల్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గురైన కారుకు తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు తమిళనాడు దిండిగల్ ఇంజినీరింగ్ విద్యార్థులుగా చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదానికి కారణం.. డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా కారు డ్రైవ్ చేయడమేనని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఆగిఉన్న లారీని కారు అతివేగంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రతకు కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. లారీ కిందకు దూసుకెళ్లింది.
