ఆన్ లైన్ రమ్మీకి ఉద్యోగి బలి

  • Publish Date - November 15, 2020 / 04:58 PM IST

Man ends life after losing lakhs in online games : ఆన్ లైన్ లో పేకాట వ్యసనానికి ఒక జీవితం బలైపోయింది. ఆన్ లైన్ రమ్మీ ద్వారా లక్షలాది రూపాయలు నష్టపోయిన డాక్ యార్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నంలోని గోపాల పట్నంలో ఈవిషాద సంఘటన  జరిగింది.

గోపాలపట్నం శివారు గ్రామం కొత్తపాలెం చెందిన నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి మద్దాల సతీష్ ఆన్లైన్లో లో రమ్మీ పేకాట ఆడికి బానిసయ్యాడు. ఆన్ లైన్ లో రమ్మీ ఆటతో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. గత మూడు రోజులుగా సతీష్ కనబడక పోవడంతో కుటుంబ సభ్యలు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్ కోసం గాలింపు చేపట్టారు.



కాగా  ఆదివారం ఉదయం సతీష్ మృతదేహాన్ని మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ సమీపాన రైల్వే ట్రాక్ పై గుర్తించారు. రమ్మీ ఆటలో సుమారు కోటి రూపాయలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. సతీష్ కు భార్య ప్రత్యూష(28) పాప సాయి మోక్షిత(6) ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రైల్వే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.