Man Stuck Between Train : ప్రయాణికుడి పైనుంచి వెళ్లిన రైలు.. చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి.. ఎలా అంటే?

అనంతపురంకు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం1లో ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కేందుకు వచ్చాడు. రైలు కదులుతుండటంతో రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు..

Man Stuck Between Train

Vijayawada Railway Station : మృత్యువు నోటిదాక వెళ్లిన ఓ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు దక్కించుకున్నాడు.. రైలు ఎక్కేందుకు వచ్చిన వ్యక్తి.. రైలు ఎక్కుతుండగా పట్టాలపై పడిపోయాడు.. ఊహించని పరిణామంతో ప్రాణాలు వదిలేసి పట్టాల మధ్యలో పడుకుండిపోయాడు.. చుట్టుపక్కల వారంతా అతడు ప్రాణాలతో ఉండటం అసాధ్యమని అనుకున్నారు.. రైలు వెళ్లిపోయిన తరువాత అందరూ వెళ్లి చూడగా సదరు వ్యక్తి ప్రాణాలతో కనిపించాడు.. గాయాలుకూడా కాలేదు.. దీంతో హమయ్య అంటూ అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన విజయవాడ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.

Also Read : Komatireddy Venkat Reddy : రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ‘సలార్’ సాంగ్ చూశారా.. సోషల్ మీడియాలో వైరల్.. కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ ఖుషీ..!

అనంతపురంకు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం1లో ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కేందుకు వచ్చాడు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో రైలు కదులుతుండగా రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రతాప్ కాలుజారి రైలు పట్టాలపై పడిపోయాడు. ఊహించని పరిణామంతో ఏం చేయాలో తోచని ప్రతాప్.. చాకచక్యంగా వ్యవహరించి పైకిలేవకుండా రైలు వెళ్లేవరకు పట్టాల మధ్యలో పడుకుండిపోయాడు.. ఈ ఘటన చూసిన తోటి ప్రయాణికులు కేకలు వేశారు. రైలు వెళ్లిపోయాక ప్రతాప్ వద్దకు వెళ్లి లేపారు. ప్రమాదంలో అతనికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.