Manchu Vishnu: విజయవాడకు మంచు విష్ణు.. కాసేపట్లో సీఎం జగన్‌తో భేటీ..!

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు.. సడన్ గా విజయవాడలో ప్రత్యక్షం అయ్యారు. హైదరాబాద్ నుంచి ఆయన కాసేపటిక్రితం విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు.

Manchuvishnu

Manchu Vishnu: టాలీవుడ్ లో సమస్యల పరిష్కారానికి.. ఏపీ ప్రభుత్వంతో సినీ పెద్దల మంతనాల క్రమంలో.. ఇవాళ మరో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ మధ్య చిరంజీవితో కలిసి టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కావడం.. తర్వాత మంత్రి పేర్ని నాని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లి మాట్లాడ్డం.. ఆ విషయంపై మంచు విష్ణు ట్వీట్, తర్వాత సవరణ ట్వీట్.. ఇలా ఒకదానివెంట మరోటి ఇంట్రెస్టింగ్ పరిణామాలు జరుగుతూ వచ్చాయి.

ఇంతలో.. ఇవాళ.. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు.. సడన్ గా విజయవాడలో ప్రత్యక్షం అయ్యారు. హైదరాబాద్ నుంచి ఆయన కాసేపటిక్రితం విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి నేరుగా.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

మరి కాసేపట్లోనే.. ముఖ్యమంత్రి జగన్ ను.. మంచు విష్ణు కలవనున్నారు. సినిమా టికెట్ల అంశంతో పాటు.. మరిన్ని ఇతర విషయాలు, ఇండస్ట్రీ సమస్యలపైనా ఆయన జగన్ తో చర్చించే అవకాశం ఉంది. మా.. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత విష్ణు.. మొదటిసారి సీఎం జగన్‌ను కలవనుండడం.. ప్రాధాన్యత సంతరించుకుంది.

అసలు విష్ణు.. విజయవాడకు ఎందుకు వెళ్లారు.. సీఎం జగన్ తో ఏం మాట్లాడతారు.. సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెడతారా.. మీడియాకు ఏం చెబ్బబోతున్నారు.. టాలీవుడ్ పెద్దల సమావేశంపై ఎలాంటి కామెంట్లు చేయబోతున్నారు.. అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే.. జగన్ తో చిరంజీవి సమావేశాన్ని పర్సనల్ గా చెప్పుకొచ్చిన విష్ణు.. చాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకునే నిర్ణయాలే టాలీవుడ్ లో ఫైనల్ అని.. చాంబర్ ప్రతినిధులతోనూ ప్రభుత్వం తప్పక చర్చించాల్సిన అవసరం ఉందని స్పష్టమైన కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో.. జగన్ ను విష్ణు కలవనుండడంపై.. ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.