Manickam Tagore: విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్‌కి మాణిక్యం ఠాగూర్ ఫిర్యాదు

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేశానని తెలిపారు.

Manickam Tagore

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్‌కి ఫిర్యాదు చేశారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్. లోక్‌సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడకూడదని, అలా మాట్లాడితే ఆ వ్యాఖ్యలు తొలగించాలన్నారు. నాన్సెన్స్ అని ఎలా అంటారని నిలదీశారు.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేశానని తెలిపారు. 33 నిమిషాల ప్రసంగంలో 30 నిమిషాలు కాంగ్రెస్ గురించే సాయిరెడ్డి మాట్లాడారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందని తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పారు.

అలాగే, విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చారని తెలిపారు. మోదీ సర్కారు ఆ హామీని నెరవేర్చలేదని, అయినప్పటికీ కాంగ్రెస్ తప్పు చేసిందంటూ విజయసాయిరెడ్డి కామెంట్లు చేస్తున్నారని చెప్పారు. బీజేపీకి విజయసాయిరెడ్డి లొంగిపోయారని అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు