Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి నష్టం లేదు.. బోట్లు తొలగించాక మరమ్మతులు చేపడతాం : కన్నయ్య నాయుడు

బోట్లు ఢీకొనడం వల్ల ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు అన్నారు. గేట్లు, గోడలు అన్ని పటిష్ఠంగానే ఉన్నాయని తెలిపారు.

Prakasam Barrage

Prakasam Barrage : బోట్లు ఢీకొనడం వల్ల ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు అన్నారు. గేట్లు, గోడలు అన్ని పటిష్ఠంగానే ఉన్నాయని తెలిపారు. మంగళవారం ఉదయం మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి కన్నయ్య నాయుడు బ్యారేజీని పరిశీలించారు. బ్యారేజీ గేట్ల పైన నిర్మించిన ఆయిస్ట్ బ్రిడ్జిని ఎక్కి బ్యారేజీ, గేట్ల పటిష్టతను ఆయన పరిశీలించారు. బ్యారేజీ పటిష్టంగా ఉందని, రెండు గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని గుర్తించడం జరిగిందని చెప్పారు. తొలుత గేట్లకు అడ్డంగా ఉన్న భారీ పడవలను తొలగించాలని అధికారులకు సూచించారు. బోట్లు తొలగించాకే మరమ్మతులు ప్రారంభించడం సాధ్యపడుతుందని కన్నయ్యనాయుడు స్పష్టం చేశారు.

Also Read : AP : ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు.. భారీ వర్షాలు కురిసే అవకాశం

బోట్లు ఢీకొనటం వల్ల ప్రకాశం బ్యారేజీకి నష్టం లేదని, కేవలం కౌంటర్ వెయిట్ లు దెబ్బతిన్నాయని చెప్పారు. దెబ్బతిన్న వాటిని తొలగించి కొత్త కౌంటర్ వెయిట్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నీటిమట్టం ఎనిమిది లక్షల క్యూసెక్కులకు చేరిన తరువాత పనులు ప్రారంభిస్తామని, పనులు పూర్తయ్యే వరకు పదిహేను రోజుల్లో సమయం పడుతుందని చెప్పారు. వాటర్ ప్లో పెరిగితే పనులు నిర్వహించడం కష్టమవుతుందని తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు