Megastar Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్.. క్లారిటీ ఇచ్చిన చిరు టీం!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారంటూ ప్రచారం జరుగుతున్న వార్తలపై ఆయన పిఆర్ బృందం స్పందించింది.
- V Santhosh Kumar
- Published on- August 6, 2026 / 04:02 PM IST
Chiranjeevi team clarifies about ap brand ambassador rumors
- ఏపీ బ్రాండ్ అంబాసిడర్ ప్రచారం ఖండన
- చిరంజీవి దృష్టి సినిమాలపైనే
- త్వరలోనే బిగ్ బర్త్‌డే అప్‌డేట్స్
Megastar Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలపై ఆయన పిఆర్ బృందం స్పందించింది. రాష్ట్రాన్ని పర్యాటకం, పెట్టుబడుల పరంగా ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం చిరంజీవిని కోరిందంటూ వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అభిమానులు, నెటిజన్లు ఇలాంటి ధ్రువీకరించని అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని కోరుతూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేయడంతో ఈ ఊహాగానాలకు చెక్ పడింది.
Nirmala Sitharaman: ఇక ఆ చట్టాలు చెల్లవు.. నూతన బ్యాంకింగ్ బిల్లుకు ఆమోదం.. లోక్‌సభ కీలక నిర్ణయం
పూర్తిగా సినిమాలపైనే మెగాస్టార్ దృష్టి:
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చిరంజీవి (Megastar Chiranjeevi)తన పూర్తి సమయాన్ని, దృష్టిని ప్రాజెక్టులపైనే కేటాయిస్తున్నారు. వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 158’ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను చిరు పుట్టినరోజైన ఆగస్టు 22న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
వరుస ప్రాజెక్టులతో బిజీగా చిరు:
మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ను దసరా కానుకగా అక్టోబరు 16న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిరు బర్త్‌డే సందర్బంగా వచ్చే అవకాశముంది. ఈ చిత్రాల అనంతరం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, హీరో నాని నిర్మాణంలో చిరంజీవి మరో కొత్త ప్రాజెక్ట్ చేయనున్నారు.
