AP Minister Mekapati Goutham Reddy
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని నెల్లూరుకు తరలించారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో నిన్న ఆయన తుదిశ్వాస విడిచారు. నిన్న ఉదయం తీవ్రమైన గుండెపోటుకు గురైన గౌతమ్.. కాసేపటికే ప్రాణం విడిచారు. ఇవాళ ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన పార్థివ దేహాన్ని నెల్లూరుకు తరలించారు. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.