Rain Alert
Rain Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు (Rain Alert) దంచికొట్టనున్నాయి. రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పొంచిఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్సు ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. ఆ తరువాత 48 గంటల్లో అది మరింత బలపడుతుందని పేర్కొంది.
నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని కారణంగా ఏపీలోని వచ్చే మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఇవాళ (గరువారం) ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది.
Also Read: ఏపీ ప్రభుత్వం సంచలనం.. చెవిరెడ్డి, ఫ్యామిలీ ఆస్తులు అటాచ్..
రేపు (శుక్రవారం) కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు.. రాష్ట్రంలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చుక్కలు చూపిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టులో 5.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. చింతపల్లిలో 6.8, డుంబ్రిగుడలో 7.8, పాడేరు, పెదబయలులో 8.1డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరోవైపు శ్రీకాకుళం, ఎన్టీఆర్, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కూడా 10 నుంచి 15డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న వారం రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.