AP Rains : ఏపీ ప్రజలకు బిగ్‌అలర్ట్.. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్ష సూచన.. బయటకు వెళ్లొద్దు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..
AP Rains : ఏపీలోని పలు జిల్లాల్లో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలతోపాటు పిడుగులు పడే చాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
- Harishth Thanniru
- Published On : March 25, 2026 / 06:35 AM IST
Meteorological Department has predicted Heavy rain AP
- ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్ష సూచన
- ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం
- అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచన
AP Rains : ఏపీలో గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈదురుగాలలతో కూడిన వానలతోపాటు.. పలు ప్రాంతాల్లో పిడుగులు పడుతున్నాయి. అయితే, వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులతో కూడిన వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : Gold Rate decreased : గంటల వ్యవధిలోనే కుప్పకూలిన బంగారం ధర.. గతంలో ఎప్పుడూ లేనంతగా.. కొత్త ధరలు ఇవే!
ద్రోణి ప్రభావంతో ఏపీలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో పపిడుగులు పడొచ్చని వారతావరణ కేంద్రం పేర్కొంది.
ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు బయటకు వెళ్లొద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షం పడే సమయంలో పొరపాటున కూడా చెట్ల కింద ఉండొద్దని, ఇది ప్రాణాప్రాయానికి దారితీస్తుందని తెలిపారు. ఈదురుగాలులు సమయంలో హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాల వద్ద.. విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు.
రబీలో రైతులు సాగుచేసిన పంటలు ప్రస్తుతం చేతికొచ్చే దశలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులు కల్లాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే, వర్షాల నేపథ్యంలో అన్నదాతలు పంటల ఉత్పత్తులను కాపాడుకునేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
