AP Rains Update : దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో ఐదు రోజులు భారీ వర్షాలు.. ఈదురుగాలులు, పిడుగులు పడేచాన్స్.. హైఅలర్ట్ జారీ..

AP Rains Alert : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతున్న కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Meteorological Department 5 Days Rains in AP Due To Low Pressure in Bay of Bengal

  • బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
  • ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన
  • హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

AP Rains Update : ఏపీలో ఒకపక్క ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు వర్షాలు సైతం విజృంభిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, తాజాగా భారత వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది. రాబోయే ఐదు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : Uttar pradesh : యూపీలో వర్షాల బీభత్సం.. 60మందికిపైగా మృతి.. సీఎం యోగి ఆధిత్యనాథ్ కీలక నిర్ణయం..

ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదిలాఉంటే.. మే16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఇది దేశంలో వర్షాకాలం ప్రారంభానికి సంకేతం కానుందని వాతావరణ శాఖ అధికారలు తెలిపారు.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండల తీవ్రతతో పాటు అల్పపీడనం ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం వంటి జిల్లాల్లో మే 15, 16 తేదీల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో మే 15, 16 తేదీల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్ ల వద్ద ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.