AP Rain Alert : ఏపీలో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో భీకరగాలులతో దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ

AP Rain Alert : ఏపీలో వచ్చే వారంరోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని జిల్లాల్లో భీకర గాలులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

  • ఏపీకి వర్ష సూచన
  • నేడు పలు జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు
  • హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

AP Rain Alert : ఏపీలో గత మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజుల క్రితం వరకు వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాగు పనులు నెమ్మదించాయి. ప్రస్తుతం మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.

Also Read : Sonam Wangchuk : అర్ధరాత్రి హైడ్రామా.. దీక్ష విరమించిన సోనం వాంగ్‌చుక్.. త్వరలోనే షరతులను వివరిస్తానని వెల్లడి

ఏపీలో వచ్చే వారంరోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని జిల్లాల్లో భీకర గాలులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడా పిడుగులుపడే అవకాశం ఉందని, ప్రజలు వర్షాలు, ఈదురుగాలులు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

ఏపీలోని గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, నేడు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కికానాడ, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అదేవిధంగా విశాఖపట్టణం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, పలు జిల్లాల్లో భీకరగాలులు వీస్తాయని, భారీ వర్షాలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు ఆరుబయట, చెట్ల కింద, ఎత్తైన ప్రదేశాల్లో నిలబడకూడదని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు, కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అలాగే ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. చెట్ల కింద, స్తంభాల దగ్గర నిలబడకూడదని సూచిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో కూడా బయట ఉండొద్దని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.