AP Rains : ఏపీకి రెయిన్ అలర్ట్.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ దంచికొట్టనున్న వానలు..

AP Rains : ఈశాన్య బంగాళాఖాతంలో ఈనెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తరువాత వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.

AP Rains

AP Rains : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా ఏపీలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకదాటిగా వర్షాలు కురుస్తుండడంతో సాగు చేసిన పంటలు దెబ్బతిని రైతులు నష్టాల పాలవుతున్నారు. అయితే, ఏపీ వ్యాప్తంగా మరో నాలుగు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ఏపీలో వర్షాలకు సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

Also Read: Marri Rajasekhar : వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.. చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకోనున్న మాజీ వైసీపీ నేత

ఈశాన్య బంగాళాఖాతంలో ఈనెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 27నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, పశ్చిమ – వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వార్తలతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రైతుల సాగు చేసిన పంటలు దెబ్బతిండటంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

ఏపీలో గురువారం సాయంత్రం 5 గంటల వరకు తిరుపతి జిల్లా మల్లంలో 70 మి.మీ, కాకినాడ జిల్లా ఇంజరంలో 58 మి.మీ, తిరుపతి జిల్లా కోటలో 52.7 మి.మీ, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 52.2మి.మీ, యర్రగొండపాలెంలో 49.7 మి.మీ, చిత్తూరు జిల్లా దామోదర మహారాజపురంలో 49 మి.మీ, కోనసీమ జిల్లా ఈతకోటలో 47 మి.మీ వర్షపాతం నమోదైంది. అయితే, ఏపీ వ్యాప్తంగా మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆయా జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శా తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.