AP Rains : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ.. బయటకు రావొద్దు..

AP Rains : మరికొద్ది గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

AP Rains

AP Rains : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, సోమవారం సాయంత్రం, రాత్రి సమయాల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. (AP Rains)

Also Read: Dowry Dispute: ఎంతకు తెగించార్రా..! పాపం.. అదనపు కట్నంకోసం కోడలిని గదిలో వేసి పామును వదిలారు.. చివరిలో బిగ్ ట్విస్ట్..

ఇవాళ రాత్రి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అనకాపల్లి, కాకినాడ, జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

భారీ వర్షాలతోపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, హోర్డింగ్స్ ఉన్న ప్రాంతాల్లో, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర ఉండొద్దని, ప్రజలు అప్రమతంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.