రాజకీయాల నుంచి క్విట్… పవన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్.. అందుకే బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారా?

సమస్య పరిష్కరించలేని నాడు రాజకీయాల్లో ఉండను అన్న ఒక్కమాట.. పవన్‌ను పిఠాపురం ప్రజలకు ఇంకా దగ్గర చేసిందని.. ఆయన నిజాయితీ ఏంటన్నది తెలియచేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రాజకీయాల నుంచి క్విట్… పవన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్.. అందుకే బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారా?

Updated On : October 10, 2025 / 9:24 PM IST

Pawan Kalyan: ఒకప్పుడు ఆయన ఒక్కసీటు కూడా సాధించలేని నేత. ఇప్పుడు 21 సీట్లు. తాను గెలిచి.. కూటమిని అధికారంలోకి తెచ్చి.. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉండి.. పాలిటిక్స్‌లో సమ్‌థింగ్‌ స్పెషల్‌గా గుర్తింపు పొందారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్‌ దూకుడే వేరు. ఆయన ప్రసంగాలు నెక్స్ట్ లెవల్‌ మాస్‌ మసాలతో..ఓ రేంజ్‌ అటాకింగ్‌ మోడ్‌లో ఉండేవి. ఇప్పుడు పవన్ పవర్‌లో ఉన్నారు. పైగా ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు. అప్పుడు పవర్‌లో ఉన్న పార్టీపై దుమ్మెత్తిపోయొచ్చు. బట్‌ పవర్‌లోకి వచ్చేసరికి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయలేకపోవచ్చు. సమస్యలు కూడా పరిష్కారం చేయలేని సిచ్యువేషన్స్‌ కూడా ఉంటాయి. అలాంటప్పుడు లీడర్లు సైలెంట్‌గా..అది పెద్ద ఇష్యూ కాదన్నట్లుగా కవర్ చేస్తుండటం చూశాం. కానీ పవన్‌ అలా కాదు. తన రూటే సెపరేటు అంటున్నారు. ఏకంగా అపోజిషన్‌ లీడర్‌గా మాట్లాడినట్లు అగ్రెసివ్‌గా చాలా బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నారు. (Pawan Kalyan)

పవన్‌ ఉప్పాడ టూర్‌ పొలిటికల్‌గా చాలా ఆసక్తిని క్రియేట్ చేసింది. వాస్తవానికి ఉప్పాడలో మత్స్యకారుల సమస్యలు చాలా సంక్లిష్టం. వాటిని పరిష్కరించడం అంత ఈజీ కాదు. అందుకే ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా..మత్స్యకారుల సమస్యలు పూర్తిస్థాయిలో సాల్వ్‌ కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కల్యాణ్‌కు మత్స్యకారుల సమస్యల పరిష్కారం అతిపెద్ద సవాల్‌గా మారిందన్న చర్చ నడుతస్తుంది. మెడికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వ్యర్థాలు కలవడంతో సముద్ర జలాలు కలుషితం అయి..వేట సాగక మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు.

Also Read: “ఒరేయ్‌.. మీరు ముగ్గురు వచ్చి మా ఇంట్లో చోరీ చేయండ్రా..” అని ఫ్రెండ్స్‌కి చెప్పిన యువకుడు.. ఆ తర్వాత ..

ఈ మధ్యే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన మత్స్యకారులు..డిప్యూటీ సీఎం సమాధానం చెబితే తప్ప ఊరుకునేది లేదని పట్టుబట్టారు. స్పందించిన పవన్ వస్తా..సమస్య పరిష్కారనని హామీ ఇచ్చి..అన్న మాట ప్రకారం ఒకరోజు ముందే ఉప్పాడకు వెళ్లారు. ఈ సందర్భంగా అధికారులతో రివ్యూ నిర్వహించిన తర్వాత..ఉప్పాడలో నిర్వహించిన బహిరంగసభలో పవన్‌ ఇచ్చిన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది. అపోజిషన్ లీడర్‌గా ఉన్నప్పుడు పబ్లిక్‌ను అట్రాక్ట్ చేసేలా మాట్లాడటం వేరు. ఇప్పుడు పవర్‌లో పవన్‌ మీద జనం హోప్స్ ఉన్నాయి.

రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన

వాటికి అనుగుణంగానే పవన్ మాట్లాడారు. నేను ఉన్నాను మీకు అన్నీ చేస్తాను అని హామీ అయితే గట్టిగానే పవన్ ఇచ్చారు. తాను మత్స్యకారుల సమస్యలను పరిష్కరించలేని నాడు ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు పవన్. మత్స్యకారుల సమస్యల మీద తనకు అవగాహన ఉందని..చిత్తశుద్ధి కూడా ఉందని ఆయన చెప్పుకున్నారు. తాను ఎవరో కొందరు లీడర్ల చేతులు తడిపి..చేయిలు దులుపుకుని పోవడానికి రాలేదన్న పవన్..సమస్య పరిష్కారం కోసం తనకు టైమ్ కావాలంటూ కోరారు. అవసరమైతే రాజకీయాలకు గుడ్‌ బై అంటూ పవన్ ఎందుకు మాట్లాడారు.? ఆవేశ పడ్డారా లేక భావోద్వేగం చెందారా లేక తన నిబద్ధత మీద ఎవరూ శంకించవద్దు అని ఒక అప్పీల్ చేశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

నిజానికి ఉప్పాడలో మత్స్యకారుల సమస్య ఇప్పటిది కాదు. ప్రతీసారి ఎన్నికలప్పుడు మత్స్యకారుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉంటాయి. కానీ ఇప్పుడు అక్కడ పవన్ ఎమ్మెల్యేగా ఉండటం..డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతల్లో ఉండటంతో ఆయనపై అతిపెద్ద బాధ్యత ఉన్నట్లు అయిపోయింది. సొంత నియోజకవర్గంలో సమస్య పరిష్కరించలేకపోతే..ఆయన విమర్శల పాలు అవక తప్పదు. అందుకే సిన్సియర్‌గా..సీరియస్‌గానే మత్స్యకారుల సమస్యపై ఫోకస్ పెట్టారట పవన్.

మెడికల్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు వచ్చి సముద్రంలో చేరకుండా..ఏం చేస్తే బాగుంటుందనే..పొల్యూషన్ ఆడిట్ చేయాలని పీసీబీ అధికారులను ఆదేశించారట. అంతేకాదు సముద్ర తీర ప్రాంతం భద్రత కోసం ఉప్పాడ దగ్గర ప్రొటెక్షన్‌ వాల్‌ను నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు.

ఉప్పాడ ఇష్యూ ఓ రకంగా పవన్‌కు పెద్ద సవాలే అయినా.. పవన్ తన ప్రసంగంతో మత్య్సకారుల మనసు గెలుచుకున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది. సమస్య పరిష్కరించలేని నాడు రాజకీయాల్లో ఉండను అన్న ఒక్కమాట.. పవన్‌ను పిఠాపురం ప్రజలకు ఇంకా దగ్గర చేసిందని.. ఆయన నిజాయితీ ఏంటన్నది తెలియచేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మెడికల్ ఫ్యాక్టరీ వ్యర్థాల సముద్రంలో కలవకుండా పవన్‌ తీసుకోబోయే చర్యలేంటి.? ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మాణం సాధ్యమయ్యేనా.? అనేది వేచి చూడాలి.