Annamayya : ‘అన్నమయ్య’ చెయ్యను అని చెప్పా.. వేంకటేశ్వరస్వామి పాత్రపై సుమన్ కామెంట్స్ వైరల్.. పాపం 8 నెలలు..
సుమన్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచిపోయిన అన్నమయ్య సినిమా గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర విషయం తెలిపారు.(Annamayya)
Annamayya
Annamayya : హీరోగా ఒకప్పుడు ఎన్నో సినిమాలతో మెప్పించిన సుమన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. తాజాగా నటుడు సుమన్ 10 టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక అంశాలు మాట్లాడారు. ఈ క్రమంలో సుమన్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచిపోయిన అన్నమయ్య సినిమా గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర విషయం తెలిపారు.(Annamayya)
సుమన్ అన్నమయ్య సినిమా గురించి మాట్లాడుతూ.. మొదట నేను అన్నమయ్య క్యారెక్టర్ చేయను అన్నాను. ఎన్టీఆర్ గారు దేవుడి పాత్రలు చేసేవారు. ఆయనతో నేను పోల్చుకోలేను అన్నాను. డైరెక్టర్, నిర్మాత అందరూ ఇంటికి వచ్చి చేయమని రిక్వెస్ట్ చేసారు. తర్వాత ఆలోచించి చెప్తాను అన్నాను. ఆ రోజు రాత్రి నాకు ఒక మంచి కల వచ్చింది. వెంటనే చేస్తా అని చెప్పా. మొదటిరోజు వేంకటేశ్వరస్వామి గెటప్ వేసాక సెట్ లో అందరూ దండం పెట్టారు. కొంతమంది కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు.
సినిమా రిలీజ్ అయ్యాక అందరూ మొదట రోజు ఫ్లాప్ అన్నారు. తర్వాత పెద్ద హిట్ అయింది. ఆ సినిమానే నాకు ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో 3 గంటలకే లేచేవాడ్ని. 5 గంటల కల్లా సెట్ లో ఉంటే 9 వరకు నాలుగు గంటలు మేకప్ కే పట్టేది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో కిరీటం ఒక్కటే తీసి అలాగే పడుకునేవాడ్ని. ఆ సినిమా కోసం నేను కూడా నిష్ఠగా ఉన్నాను. 8 నెలలు కింద పడుకున్నా, చన్నీళ్లు స్నానం చేశా, నాన్ వెజ్ తినలేదు. అన్నమయ్య సినిమా చూసి నా ముస్లిం, క్రిస్టియన్ ఫ్యాన్స్ కూడా వచ్చి చాలా బాగుందని, బాగా చేసారని చెప్పారు అని తెలిపారు.
అలాగే.. అన్నమయ్య సినిమా అయ్యాకే వేంకటేశ్వరస్వామి భక్తుడిని అయ్యాను. ఆ తర్వాత కూడా దేవుడి పాత్రలు చేశాను. అసలు సుమన్ ఏంటి దేవుడి పాత్రలు అనేవాళ్ళు. అయినా నన్ను డైరెక్టర్స్ నమ్మారు. అనేవాళ్ళు అంటారు మీరు చేయండి ఆ పాత్ర బాగా పండుతుంది అని చెప్పేవాళ్ళు డైరెక్టర్స్ అని చెప్పుకొచ్చారు సుమన్.
Also Read : Suman : ఆదిపురుష్ సినిమాపై సుమన్ ఫైర్.. ఇలా వేరే మతం మీద తీయగలరా..?
