Illicit Liquor Case: నకిలీ మద్యం కేసు.. రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ.. ఎవరి పేర్లు బయటకు వస్తాయో?

నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు 23మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Illicit Liquor Case: నకిలీ మద్యం కేసు.. రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ.. ఎవరి పేర్లు బయటకు వస్తాయో?

Updated On : October 10, 2025 / 10:52 PM IST

Illicit Liquor Case: ఏపీలో సంచలనం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో పోలీసులు దర్యాఫ్తును వేగవంతం చేశారు. ఈ కేసులో కింగ్ పిన్ జనార్ధన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్టులో కాపు కాసి జనార్దన్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు జనార్ధన్ రావును గన్నవరం విమానాశ్రయం నుంచి రహస్య ప్రదేశానికి తరలించారు పోలీసులు. అక్కడ అతడిని విచారిస్తున్నారు. కాగా, జనార్ధన్ రావు నోరు విప్పితే మరికొందరు నాయకుల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక, నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు 23మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

నకిలీ మద్యం తయారీ కేసులో 23 మంది నిందితుల వివరాలు..

జనార్దన్ రావు
కట్ట రాజు
సి బాలరాజు
టి రాజేష్
గణేషన్
అనంత శ్రీనివాసన్
సూర్య
వెంకటేశన్ సురేష్
మిథున్ దాస్
అనితాదాస్
కె శ్రీనివాసరావు
సురేంద్ర
కె నాగరాజు
బాలాజీ
ఎన్ రవి
డి జయచంద్రారెడ్డి
మంత్రి గిరిదర్ రెడ్డి
అంబురాసు
పి సుదర్శన్
అష్రఫ్
చైతన్య
శ్రీనివాస్ రెడ్డి

వీరిలో ఏ2 కట్ట రాజును విచారిస్తే తొమ్మిది మంది నిందితుల వివరాలు తెలిశాయని పోలీసులు వెల్లడించారు. 9 మందిలో ఏ 21 నిందితుడు జయచంద్రా రెడ్డి డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. 23 మందిలో బాలాజీ, రవి, జయచంద్రా రెడ్డి, గిరిధర్ రెడ్డి, అంబురాసు, సుదర్శన్, చైతన్య శ్రీనివాసరెడ్డిలను అరెస్ట్ చేయాల్సి ఉంది.

Also Read: నకిలీ మద్యం కేసులో కింగ్ పిన్ జనార్దన్ అరెస్ట్.. సౌతాఫ్రికా నుంచి రాగానే..