సత్తెనపల్లి పురవీధుల్లో బుల్లెట్ బండిపై మంత్రి అంబటి చక్కెర్లు.. వీడియో చూశారా

సత్తెనపల్లి పురవీధుల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు. బుల్లెట్ బండెక్కి వీధుల్లో చక్కర్లు కొట్టారు.

Minister Ambati Rambabu : పల్నాడు జిల్లా సత్తెనపల్లి పురవీధుల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు. ఉదయాన్నే తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి స్వయంగా బుల్లెట్ బండి నడుపుకుంటూ  వీధుల్లో చక్కెర్లు కొట్టారు. ప్రధాన కూడళ్ల వద్ద స్థానికులను పలుకరించి వారి బాగోగులను తెలుసుకున్నారు. టీ దుకాణాల వద్ద ఉన్నవారిని పలుకరించి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరాతీశారు. బెల్లెట్ పై సత్తెపల్లిలోని వీధుల్లో తిరుగుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. బుల్లెట్ బండిపై అంబటి గాంభీర్యాన్ని చూసి అంబటా మజాకా అంటూ స్థానికులు చర్చించుకున్నారు.

Also Read : చంద్రబాబుతో చర్చల తర్వాత తేలనున్న గంటా శ్రీనివాసరావు భవిష్యత్‌

ఇటీవల సంక్రాంతి వేడుకల్లో భాగంగా సత్తెనపల్లిలో భోగి మంటలు వేసి అంబటి రాంబాబు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా బుల్లెట్ బండిపై అంబటి సత్తెనపల్లి పురవీధుల్లో చక్కర్లు కొట్టాడు. అనుచరులతో కలిసి బుల్లెట్ బండి స్వయంగా తోలుకుంటూ వీధుల్లో పర్యటించారు. స్థానికులను పలుకరించుకుంటూ, ప్రభుత్వం పథకాల అమలుతీరుపై ఆరాతీస్తూ  బుల్లెట్ బండిపై అంబటి పర్యటన సాగింది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు