జగన్ స్పీకర్‌కు లేఖ రాసింది అందుకే..! మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు

వాలంటరీ వ్యవస్థపై మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఉంది. మా మీద వివిధ రకాల ఒత్తిళ్లుతెచ్చి రాజీనామా చేయించారని కొందరు

Minister Anam Ramanarayana Reddy : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఐదేళ్లు, అధికారంలో ఐదేళ్లు ఉన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు తెరలు, వలలు లేకుండా ఎప్పుడూ ఆయన అసెంబ్లీకి రాలేదని
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. నెల్లూరులో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఏడాదికి పది రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలను జగన్ నిర్వహించారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని అడగడం హాస్యాస్పదంగా ఉంది. జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదు. ఆయన ఫ్లోర్ లీడర్ గా మాత్రమే ఉండవచ్చు.

Also Read : సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే?

ఎన్నికల్లో వైసీపీకి వచ్చింది 11 స్థానాలు మాత్రమే. ప్రతిపక్ష హోదా అడగడం హాస్యాస్పదంగా ఉంది. గుర్తింపు కోసమే జగన్ స్పీకర్ కు లేఖను రాశారని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. జగన్ ఎప్పుడూ శాసనసభ నియమాలు పాటించలేదు. జగన్, ఆయన సలహాదారులకు శాసనసభ నిబంధనలు కూడా తెలియవు అంటూ విమర్శించారు. వైసీపీ హయాంలో టీటీడీ ఆలయాలను భ్రష్టు పట్టించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. ఆలయంలో సంప్రదాయాలను భంగం చేసిన అధికారులను తొలగించామని మంత్రి పేర్కొన్నారు. దుర్మార్గాలకు పాల్పడిన నేతలకు ప్రజలు బుద్ధి చెప్పారు. తిరుమలతో పాటు రాష్ట్రంలోని 27వేల దేవాలయాలను ప్రక్షాళన చేస్తామని మంత్రి రామనారాయణ రెడ్డి చెప్పారు.

Also Read : స్మగ్లింగ్ కేసు.. తెలంగాణ మంత్రి కొడుకు నివాసంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు

వాలంటరీ వ్యవస్థపై మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఉంది. మా మీద వివిధ రకాల ఒత్తిళ్లుతెచ్చి రాజీనామా చేయించారని కొందరు వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ వ్యవస్థపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు భూమిని కేటాయించే విషయంలో నిబంధనలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా వీటిని నిర్మిస్తున్నారు. జగన్ కు పెద్ద భవనాలు కావాలనే మానసిక ప్రవర్తన ఉంది. అందుకే పార్టీ కార్యాలయం పేరుతో 28చోట్ల ప్యాలస్ లు కడుతున్నారు. భవిష్యత్తులో ఈ కార్యాలయాలను కూడా ఆస్తులుగా మలుచుకోవాలని నిర్మిస్తున్నట్లున్నారని మంత్రి రామనారాయణ రెడ్డి విమర్శించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు