వారికి లబ్ధిచేకూర్చేందుకే ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్లు నిలిపివేత : మంత్రి అనగాని సత్యప్రసాద్

నిబంధనలకు విరుద్దంగా గత ప్రభుత్వం అనర్హులకు అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.

Minister Angani Satyaprasad

Minister Anagani Satya Prasad : ఒరిజనల్ అసైనీలకు లబ్ది చేకూర్చేందుకే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్లు మూడు నెలల పాటు నిలిపివేస్తున్నట్లు రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని అన్నారు. అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకొని వైసీపీ నేతలు ఒరిజనల్ అసైనీల నుండి అతి తక్కువ ధరలకే భూములను కొనేశారని మంత్రి అనగాని అన్నారు.

Also Read : వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడు అరెస్ట్.. చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

నిబంధనలకు విరుద్దంగా అనర్హులకు అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారు. కొన్ని ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుండి ఫ్రీ హోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ప్రజా అవసరాలకు ఉంచిన ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ర్టేషన్లు చేశారు. రిజిస్ట్రేషన్ అయిన అసైన్డ్ భూముల్లో కొన్ని నిబంధనలకు విరుద్దంగా గిఫ్ట్ డీడ్లుగా చేసి ప్రభుత్వ ఆదాయానికి గత ప్రభుత్వం గండి కొట్టిందని అన్నారు.

Also Read : ఉద్యమకారుల కొట్లాట.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ వివాదం ఏ మలుపు తీసుకోనుంది?

20ఏళ్ల పరిమితి దాటని భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసినట్లు సమాచారం ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో జరిగిన తప్పులన్నింటిని సరిచేసేందుకే మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. ఒరిజనల్ అసైనీలకు వందకు వందశాతం పూర్తి న్యాయం చేస్తామని చెప్పిన మంత్రి.. ఫ్రీ హోల్డ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు