వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడు అరెస్ట్.. చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడు అరెస్ట్.. చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Jogi Ramesh son Arrest

Jogi Ramesh Son Arrest : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను, ఫైళ్లను తనిఖీ చేశారు. 15మంది అధికారులు తెల్లవారు జామున 5గంటల నుంచి సోదాలు చేపట్టారు. కొద్దిగంటలకే జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ.. తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్టు చేశారని ఆరోపించారు. కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని జోగి రాజీవ్ అన్నారు.

Also Read : దువ్వాడ కుటుంబంలో చిచ్చుకు అసలు కారణం అదేనా, ఆమె వ్యూహం ఫలించిందా?

కుమారుడు రాజీవ్ అరెస్ట్ పై మాజీ మంత్రి జోగి రమేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. నేను, నా కుటుంబం అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఏదైనా తప్పు చేసి ఉంటే విజయవాడ నడిరోడ్డులో ఉరేసుకుంటాం. బలహీన వర్గాలకు చెందిన మమ్మల్ని వేధించడం.. ఇది న్యాయమా చంద్రబాబు నాయుడు అంటూ ప్రశ్నించారు. నా కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే పైన దేవుడున్నారు. మీరు మమ్మల్ని తొక్కొచ్చు.. మాపై కేసులు పెట్టొచ్చు.. రెడ్ బుక్ తీయొచ్చు. మీరు ఇంత దుర్మార్గంగా ఏమీ తెలియని కుర్రాడిపై కేసుపెట్టి జైల్లో పెట్టాలన్న వంకర బుద్దిని మార్చుకోవాలని అన్నారు.